Thursday, January 23, 2025

మహిళలకు పెద్దన్నలాగా ఆదరిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దే

- Advertisement -
- Advertisement -

కేపీహెచ్‌బి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మహిళా సంక్షేమ శాఖ, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి ఎన్‌కేఎన్‌ఆర్ గార్డెన్స్‌లో మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్ల్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మహిళలకు అనేక సంక్షేమ పథకా లు అందించి వారికి పెద్దన్నలా నిలిచారని కొనియాడారు.

ముఖ్యంగా ఇంటింటికి మంచినీరు అందించి నీటికష్టాలు తీర్చారని ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఎదిగే వరకు వారికి కెసిఆర్ కిట్, గురుకుల విద్యాలయాల ద్వారా కేజీటూ పీజీ వి ద్య, ఆడపిల్ల పెళ్ళికి లక్షా రూ.116 లు అందించిన గొప్ప నాయకులు సిఎం కెసిఆర్ అని కొనియాడారు. అంతేగాకుండా కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు 15వేలమందికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ ద్వారా ఆర్థిక సహాయం అందించనట్లు పేర్కొన్నారు. మహిళా సంఘలకు ప్రత్యేకంగా భవనం నిర్మించేందుకు ఖైత్లాపూర్ వద్ద స్థలం కేటాయించామని, త్వరలో అక్కడ భవనం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మహిళల రక్షణ కోసం సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారని మహిళలకు అన్యాయం జరిగితే ఎలాంటి పరిణాలు జరుగుతాయో రోజు చూస్తూనే ఉన్నారని చె ప్పారు.

మహిళల అభ్యున్నతి కోసం వృత్తి విద్యలో శిక్షణ ఇప్పించి వారికి సర్టిఫికెట్స్ అందజేయడమే కాకుండా ఆరు స్వయం కృషితో ఎదిగేందుకు సహాయ సహకారాలు అందించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు నెలలో వెయ్యిమందికి కుట్టు మిషన్‌లు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా మహిళల కోసం పార్కులు నిర్మించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ఈ సందర్భం గా ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు సన్మానం చేసి మె మోంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీలు రవికుమార్, రవీందర్‌కుమార్‌లతోపాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News