Saturday, November 23, 2024

అన్ని కులాల దేవాలయాలను అభివృద్ధి చేస్తున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హన్మకొండ టౌన్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవిస్తూ అభివృద్ధి చేస్తూ వస్తున్నారని అన్నారు. సోమవారం హనుమకొండలోని 6వ డివిజన్ లోని ఉన్న సిక్కుల దేవాలయం గురుద్వార్‌లో కమిటీ హాల్ నిర్మాణం కోసం ఏక్కడ లేని విధంగా రాష్ట్రం లోనే మొదటిసారి కోటి 50 లక్షల రూపాయలు సిఎం కెసిఆర్,ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ చొరవతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మంజూరు చేయడమైనది.

ఇందులో భాగంగా ప్రభుత్వ చీప్ విప్, హనుమకొండ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని గురుద్వార్ చేరుకొని ప్రత్యేక పూజలలో పాల్గొని అనంతరం కమిటీ హాల్ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం గురుద్వార్ కమిటీ సభ్యులు కమిటీ హాల్ కోసం కృషి చేసినందుకు ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్ రాజ్, స్థానిక కార్పొరేటర్ చెన్నం మధు,రాష్ట్ర మైనార్టీ కమిషన్ మెంబర్ దర్శన్ సింగ్, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, గుంటి శ్రీనివాస్,మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, సుగుణకర్ గురుద్వార్ అధ్యక్షులు మహేందర్ సింగ్,ఓంకార్ సింగ్, అవతార్ సింగ్,చెత్రపాల్ సింగ్, 6వ డివిజన్ గౌరవ అధ్యక్షులు రెడ్డి రాజేశ్వర్, డివిజన్ అధ్యక్షులు మడిపెళ్లి సుమన్ గౌడ్ ,రాజేందర్ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి ప్రధాన కార్యదర్శి బజ్జురి అజయ్ కుమార్ ,వెన్ను కొండయ్య , ఎజాజ్ ,కిషోర్ ,బాబన్న ,పవన్,రాము, కృష్ణ, రాజు మహిళా మండలి ఆర్పి లు, బారాసా నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News