Thursday, January 23, 2025

కనిపించని నాలుగో సింహం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

పోలీసులు శాంతిభద్రతలు కాపాడడం వల్లే రాష్ట్రానికి వరదలా పెట్టుబడులు
హోంశాఖ మహిళా సురక్షా సంబరాల్లో ఎంఎల్‌సి కవిత వ్యాఖ్యలు
దేశంలోనే మన పోలీసు వ్యవస్థ మొదటి స్థానంలో ఉంది :హోంమంత్రి

ఆడబిడ్డల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం

మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్ ప్ర భుత్వం ఆడబిడ్డల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలోని మహిళల భద్రత బాధ్యతను సిఎం కెసిఆర్ తీసుకున్నారని బిఆర్‌ఎస్ ఎం ఎల్‌సి కల్వకుంట్ల కవిత తెలిపారు. రాష్ట్రంలో మ నకు కనిపిస్తున్న పోలీసులు మూడు సింహాలైతే కనపడకుండా వాళ్ల వెనుక ఉండి నడిపించే నాలు గో సింహం సిఎం కెసిఆర్ అని అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో హోం శాఖ నిర్వహించిన మహిళా సురక్ష సం బరాల్లో కవిత పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ లో ఆడబిడ్డలకు ప్రాధాన్యత ఇచ్చే మంచి సంస్కృ తి ఉందని తెలిపారు. రాష్ట్రంలోని ఆడపిల్లల భద్ర త, సంక్షేమ బాధ్యతలను సిఎం కెసిఆర్ తీసుకున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన కొద్దికాలంలోనే షీటీమ్స్‌ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

ఆడపిల్లలపై కన్నెత్తి చూస్తే తాట తీస్తామన్న సందేశాన్ని ఇచ్చి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని చెప్పారు. తెలంగాణను స్పూర్తిగా తీసుకొని 18 రాష్ట్రాలు షీటీమ్స్‌ను ఏర్పాటు చేశాయన్నారు. రాష్ట్రంలో మనకు కనిపిస్తున్న పోలీసులు మూడు సింహాలైతే కనపడకుండా వాళ్ల వెనుక ఉండి నడిపించే నాలుగో సింహం సిఎం కెసిఆర్ అని అన్నారు. తెలంగాణ ఏర్పడితే ఇది నక్సలైట్ల రాజ్యం అవుతుందని, రౌడీ రాజ్యం అవుతుందని, మతకల్లోలాలు జరుగుతాయని కొందరు అవహేళనగా మాట్లాడిన మాటలు పటాపంచలయ్యాయని స్పష్టం చేశారు. గత 9 ఏళ్లలో ఒక్క రోజు కూడా కర్ఫూ లేదని, ఒక్క మతకల్లోలం జరగలేదని వివరించారు. పోలీసులు అద్భుతమైన భద్రత అందిస్తున్న కారణంగా ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వరదలాగా వస్తున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా అర్థరాత్రి 12 గంటలకు ఆడపిల్లలు ధైర్యంగా రోడ్లపై నడిచివెళ్లే పరిస్థితి ఉందని, మఖ్యంగా హైదరాబాద్ 100 నెంబరుకు ఫోన్ చేస్తే 7నిమిషాల్లో పోలీసులు వస్తారని, గ్రా మీణ ప్రాంతాల్లో 14వ నిమిషంలో పోలీసులు బాధితుల వద్దకు చేరుతున్నారని వివరించారు. ఇన్ని విజయాలు సాధిస్తున్న పోలీసులకు ప్రజానీకం తరఫున కవిత వందనాలు తెలియజేశారు. సిఎం మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని, ఈ సంకల్పాన్ని అమలు చేయడంలో మహి ళా భద్రతా విభాగం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

‘దేశంలోనే తెలంగాణ పోలీసు వ్యవస్థ తొలి స్థానంలో ఉంది’

ఇతర రాష్ట్రాలు కొన్ని దశాబ్దాలుగా సాధించలేని అభివృద్ధి తెలంగాణ దశాబ్ద కాలంలోనే సాధించగలిగామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. స్వరాష్ట్రంలో పోలీసు శాఖ ఎంతో పురోగతి చెందిందన్నారు. దేశంలోనే తెలం గాణ పోలీసు వ్యవస్థ మొదటి స్థానంలో ఉందన్నారు. సిఎం కెసిఆర్ పోలీసు శాఖకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చారని తెలిపారు. పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారని వెల్లడించారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, మహిళా కమీషన్ చైర్పర్సన్ సునీతా లక్ష రెడ్డి,, డిజిపి అంజనీ కుమార్, మహిళా భద్రతా విభాగం ఆడిషనల్ డిజి షికా గోయల్, సినీ హీరో నాని, ప్రముఖ క్రీడాకారిణి నైనా జైస్వాల్, తదితరులు హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ మహిళా సురక్ష దినోత్సవ కార్యక్రమంలో మ్యూజికల్ ఆర్కెస్ట్రా, డ్రమ్స్ ప్రదర్శనలతో ఉత్సవ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసు విభాగాల నుండి వచ్చిన మహిళా పోలీసు అధికారులు మార్షల్ ఆర్ట్ యాక్ట్‌ను ప్రదర్శించారు. కళాబృందాలు పలు జానపద సంగీతం, పాటలను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా షీ టీమ్స్ పై ‘కవచ్ ఫర్ ఉమెన్‘ అనే లఘు చిత్రాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్‌లో గ్రేటర్ హైదరాబాద్ రీజియన్‌లోని వివిధ ప్రదేశాలలో నిర్వహిస్తున్న గృహ హింస కౌన్సెలింగ్ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను అందించే ఫ్యామిలీ కౌన్సెలింగ్ స్టాళ్ళు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లోని పాఠశాల విద్యార్థులను సైబర్ అంబాసిడర్‌లుగా తీర్చిదిద్దే సైబర్ అంబాసిడర్ ప్లాట్‌ఫాం వంటి విధానాలను పౌరులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. లైంగిక హింస నుండి బయటపడిన వారికి భరోసా కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను తెలిపే స్టాల్ ను కూడా ఏర్పాటు చేశారు. గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, భరోసా కేంద్రాలకు మహిళా అభివృద్ధి , శిశు సంక్షేమ శాఖ ఎలా నిధులు సమకూరుస్తోందో, బాధితుల అభివృద్ధికి ఎలా సహాయం చేస్తుందో వివరించారు.

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వి. సునీత లక్ష్మా రెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిలు ప్రసంగిస్తూ, రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రత, భద్రతకు భరోసా ఇవ్వడంలో మహిళా సేఫ్టీ వింగ్ యొక్క కృషిని ప్రశంసించారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మన షీ టీమ్ లను ప్రారంభిస్తున్నారన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ ప్రసంగిస్తూ, తెలంగాణ మానవాభివృద్ధి సూచికలలో అద్భుతమైన అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఇది కేవలం శాంతి భద్రతల పరిరక్షణతోనే సాధ్యమైందని పేర్కొన్నారు.. ప్రజల భద్రత, భద్రతపై భరోసా తదితర అంశాలే రాష్ట్రం సాధించిన విజయాలను ప్రత్యక్షంగా సూచిస్తున్నాయని పేర్కొన్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ యొక్క కృషిని డిజిపి ప్రశంసిస్తూ, మహిళలు, పిల్లలు రాష్ట్ర శ్రేయస్సుకు భద్రతా కీలకమని, షీ టీమ్స్, సాహస్ భరోసా సెంటర్లు, సిడిఇడబ్లూ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు వంటి విభాగాలు వారిలో స్తైర్యాన్ని కల్పిస్తున్నాయన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 331 షీ టీమ్‌లు

అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ షికా గోయల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీసింగ్ యొక్క పదేళ్ల ప్రయాణం చాలా అసాధారణమైన అనుభవంగా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 331 షీ టీమ్‌లున్నాయని తెలిపారు. ‘మహిళలకు భద్రత, అందరికీ శ్రేయస్సు‘ అనే పేరుతో ఒక షార్ట్ మూవీని షికా గోయల్ ఈ సందర్బంగా విడుదల చేశారు. ఇందులో, ఉమెన్ సేఫ్టీ వింగ్ అమలు చేస్తున్న వివిధ జోక్యాలు, కార్యక్రమాలున్నా దుర్బల త్వాన్ని తగ్గించడం, సానుభూతి, మానవతా దృక్పథంతో, మహిళల భద్రత కల్పించడానికి రాష్ట్రంలో పోలీసింగ్ వ్యూహంలో ప్రదానంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.

పుస్తకం విడుదల

మహిళలపై నేరాలను పరిశోధించే విధానాలతో కూడిన పుస్తకాన్ని హోంమంత్రి మహమూద్ అలీతో పాటు డిజిపి అంజనీకుమార్ రచయిత డా. వసంత్, ఎడిజి శిఖా గోయె ల్ కూడా విడుదల చేశారు.అంతకు ముందు పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సురక్షా దినోత్సవం పేరుతో హైదరాబాద్ ట్యాంక్‌బండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పోలీసులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిజిపి అంజనీ కుమార్‌తో కలిసి హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News