Wednesday, January 22, 2025

జంగం మహేశ్వరులకు ప్రాధాన్యత ఇస్తున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -
  • జంగమ సమాజానికి భవన నిర్మాణం కోసం కృషి చేస్తా
  • ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి

గజ్వేల్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆధ్యాత్మికతకు సిఎం కెసిఆర్ పెద్దపీట వేశారని ఆ దిశగా అనేక ఆలయాలకు అభివృద్ధి చేశారని ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. శనివారం గజ్వేల్ పట్టణంలోని స్థానిక మల్లారెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన జంగమ సమాజ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి గుప్తాలు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూప దీప నైవేద్య పథకం కింద గ్రామీణ ప్రాంత అర్చకులకు వేతన సదుపాయం కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపింది కెసిఆర్ అన్నారు.

మంత్రి హరీశ్‌రావు సహకారంతో త్వరలో గజ్వేల్‌లో జంగమ సమాజానికి స్థలం కేటాయించి భవన నిర్మాణం కోసం కృషి చేస్తానని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షుడు శివప్రసాద్, నాయకులు శివకుమార్ , జంగం నాగరాజు, గజ్వేల్ జంగం సమాజ గౌరవ అధ్యక్షుడు మఠం శివకుమార్, జంగం వీరభద్రయ్య, ప్రధాన కార్యదర్శి మఠం నవీన్‌కుమార్, నాయకులు విభూతి చంద్రం, పుల్లూరి శివశంకర్, విభూతి సంతోష్, మఠం వీరభద్రయ్య, మహిళా నాయకురాలు రేఖదేవి, విభూతి బాలమణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News