Saturday, December 21, 2024

Good News: పటాన్ చెరు ప్రజలకు సిఎం కెసిఆర్ తీపి కబురు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సిఎం కెసిఆర్ భూమిపూజ చేశారు. 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని రూ. 183 కోట్లతో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పటాన్ చెరు రోజురోజుకూ అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు. పటాన్ చెరులో మహిపాల్ రెడ్డి బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. గతంతో పటాన్ చెరులో కరెంట్ కోసం సమ్మెలు చేసేవారని తెలిపారు. పటాన్ చెరులోని పరిశ్రమల్లో ఇవాళ 3 షిప్టులు నడుస్తున్నాయన్నారు.

పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం మనదేనని కెసిఆర్ పేర్కొన్నారు. పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో వస్తుందని సిఎం తెలిపారు. వచ్చే ఐదేళ్లలో పటాన్ చెరు నుంచి హయత్ నగర్ మెట్రో వస్తుందని సిఎం స్పష్టం చేశారు. పటాన్ చెరులో కాలనీలు బాగా పెరుగుతున్న ఆయన, ఐటి కంపెనీలు వచ్చేలా ప్రయత్నిస్తామని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News