Monday, December 23, 2024

పేదల పక్షపాతి సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మెదక్:సాగు, తాగు నీటితో పాటు సంక్షేమ పథకాలను అందిస్తున్న పేదల పక్షపాతి సిఎం కెసిఆర్ అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామంలో బుధవారం చెక్‌డ్యాం వద్ద సాగునీటి దినోత్సవాన్ని నీటి పారుదల శాఖ ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తెలంగాణ వచ్చి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 21 రోజులపాటు పండగ జరుపుకుంటున్నామని ఎమ్మెల్యే అన్నారు. రైతు కష్టం తెలిసిన సిఎం కెసిఆర్ హైదరాబాద్‌కు గోదావరి జలాలు అందించి సింగూరు నీటిని జిల్లా ప్రజల సాగు, తాగుకు వినియోగిస్తున్నామన్నారు.

గతంలో నీళ్లు లేక, కరెంట్ లేక, వర్షాలు పడకపోవడంతో రైతులంతా ఆగమయ్యారని అన్నారు. చెక్ డ్యాంలు నిర్మించుకోవడం ద్వారా రెండు పంటలు పండించుకుని అద్బుతమైన ధాన్యం పండించుకుంటున్నామన్నారు. సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు రైతుబంధు, రైతుబీమా, చెక్ డ్యాంల నిర్మాణం, చెరువుల పునరుద్ధ్దరణ, ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల కరెంటు వంటి సంక్షేమ పథకాలతో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని ఎన్నో యేళ్లు పాలించిన నేతలకు రైతుల కోసం ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలు నిర్మించాలన్న ఆలోచన ఎందుకు రాలేదని అన్నారు.

గత పాలకుల నిర్లక్షం వల్లనే పంట భూములు బీడు భూములుగా మారాయన్నారు. సమైక్య పాలనలో రైతులకు సాగునీరు అందించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. జిల్లాలో ఉన్న ఎకైక సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ప్రాజెక్టుకు సాగునీరు కావాలంటే ఎమ్మెల్యేలను అడిగే పరిస్తితి ఉండేదన్నారు. మెదక్ జిల్లాలో మిషన్ కాకతీయలో 1870 చెరువుల మరమ్మతు చేయగా, నియోజకవర్గంలో 484 చెరువులు, కుంటలు మరమ్మతు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం రాష్ట్రం నీటిపారుదల రంగంలో సాదించిన విజయాలకు సంబందించిన బుక్‌లెట్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, అదనపు కలెక్టర్ రమేష్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ యేసయ్య, డిఈ నాగరాజు, ఎంపిపి యమునజయరాంరెడ్డి, సర్పంచ్ రజని బిక్షపతి, పిఎసిఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, కౌన్సిలర్లు జయరాజ్, లక్ష్మీనారాయణగౌడ్, ముత్యంగౌడ్, సాంబశివరావు, కిశోర్, నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News