Monday, December 23, 2024

సిఎం కెసిఆర్‌కు స్వల్ప అస్వస్థత

- Advertisement -
- Advertisement -

మంత్రి కెటిఆర్ ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సిఎం కెసిఆర్‌కు ఇంటి వద్దనే వైద్యులు చికిత్స అందిస్తున్నారని, ఆయన ఆరోగ్యాన్ని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కొద్ది రోజుల్లో ఆయన కోలుకుని సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెప్పారని కెటిఆర్ ట్వీట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News