Saturday, November 23, 2024

తెలంగాణ రైతాంగానికి వెన్నెముక సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: తెలంగాణ రైతాంగానికి సిఎం కెసిఆర్ వెన్నెముకని, సిఎం కెసిఆర్ లక్షం తెలంగాణ రైతన్నలను రాజులుగా మార్చడమేనని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం సాయంత్రం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా రైతు మహాధర్నా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతుందని, అదనంగా కరెంటు అవసరం లేదని ఒక దుర్మార్గమైన మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు, అనేక ఇబ్బందుల్లో రైతులు ఉంటే తెలంగాణ ఏర్పాటు జరిగాక రైతులందరూ కూడా ఉచిత కరెంట్ అందిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని అన్నారు.

దేశంలతో ఇతర రాష్ట్రాలు 24గంటల కరెంటు కావాలని కోరుతున్నారని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ తరహా 24గంటలు కరెంటు కావాలని అడుగుతున్నారని చెప్పారు. 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంచేసింది ఏమీ లేదని, రైతుల సంక్షేమం పట్టని నాయకులు ఊర్లలోకి వస్తే తరిమివేయాలని, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇంజపురి పులేందర్, కుమ్మరి శ్రీనివాస్, జనగామ కవిత సరోజిని, కల్వచర్ల కృష్ణవేని, దొంత శ్రీనివాస్, దాతు శ్రీనివాస్, కన్నూరి సతీష్ కుమార్, పాముకుంట్ల భాస్కర్, ఫ్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్, నాయకులు పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, మాదాసు రామ్మూర్తి, అచ్చ వేణు, మెతుకు దేవరాజ్, పిల్లి రమేష్, చెలుకలపల్లి శ్రీనివాస్, మండ రమేష్, కలువల సంజీవ్, నీరటి శ్రీనివాస్, దాసరిశ్రీనివాస్, ముద్దసాని సంధ్యారెడ్డి, మొహిద్ సన్నీతోపాటు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News