Wednesday, January 22, 2025

మహిళా సంక్షేమానికి సిఎం కెసిఆర్ పెద్దపీట

- Advertisement -
- Advertisement -

నల్లగొండ : మహిళా సంక్షేమానికి సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నల్లగొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ బండ నరేందర్ రెడ్డి, రాజ్యసభస సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లు పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్వర్యంలో కట్టంగూర్ మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టంగూర్ మండల కేంద్రంలోని అండర్‌పాస్ దగ్గర నుండి ఈదులూర్ రోడ్డు లో గల ఎంఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్ వరకు మహిళలు, బోనాలు, బతుకమ్మలతో నిర్వహించిన భారీ ర్యాలీలో ఎమ్మెల్యే చిరుమర్తి పాల్గొని, మహిళలతో కలిసి కాసేపు కోలాటం ఆడారు.

అనంతరం ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో తొలుత జడ్పీ ఛైర్మన్ బండ నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తితో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కూచిపూడి నాట్య ప్రదర్శనలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఐసిడిఎస్ అధ్వర్యంలో మహిళా సంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి జిల్లా కలెక్టర్ ఎల్‌ఈడి స్కీన్ పై చూపిస్తూ వివరించారు. అనంతరం పలువురు మహిళలు వేదిక పై మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆడబిడ్డలను ఆర్ధికంగా బలోపేతం చేయాలన్న తపనతో ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికి స్పూర్తిగా నిలిచారని అన్నారు. మహిళా సంక్షేమానికి ఏ రాష్ట్రం అమలు చేయని పథకాలు ఒక్క తెలంగాణ లో అమలు జరుగుతున్నాయని వారు తెలిపారు. మహిళలరక్షణ కోసం షీ టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

కల్యాణలక్ష్మీ, షాద్‌ముబారక్, కెసిఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మీ, న్యూట్రిషన్ కిట్, అమ్మఒడి, ఉమెన్ హెల్ప్‌లైన్ వంటి సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి సిఎం కెసిఆర్ ఆడ్డబిడ్డలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని మహిళా సాధికారత సాధించాలని వారు కోరారు. నియోజకవర్గంలోని 6 మండలాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఙతలు తెలిపారు. అనంతరం పలువురు మహిళా లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ, షాద్‌ముబారక్ చెక్కులను వారు అందజేశారు. అదేవిధంగా క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి. వినయ్ క్రిష్ణారెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ రెగట్టె మల్లికార్జున్‌రెడ్డి, ఎంపిపి జెల్లా ముత్తి లింగయ్య, జడ్పీటిసి తరాల బలరాములు, నకిరేకల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, పోగుల నర్సింహ్మ, పిఏసిఎస్ ఛైర్మన్ నూక సైదులు, మున్సిపల్ ఛైర్మన్‌లు రాచకొండ శ్రీనివాస్ గౌడ్, కోమటిరెడ్డి చిన్న వెంకట్‌రెడ్డి, ఎంపిడిఓ పోరెళ్ల సునిత, తహశీల్దార్ పి. శ్రీనివాస్‌రెడ్డి, ఎంపిఓ ఎండి. అథర్ పర్వేజ్, ఏపిఎం చౌగోని వినోద, వైద్యాధికారి శ్వేత, మండల వ్యవసాయ అధికారిఎస్ శ్రీనివాస్, ఏపిఓ కె. రామ్మోహన్, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరి ఏడుకొడలు, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు, బిఆర్‌ఎస్ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News