Sunday, December 22, 2024

దేశాభివృద్ధికి దిక్సూచి సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -
  • జడ్పి చైర్‌పర్సన్ అనితరెడ్డి

షాబాద్ : దేశ అభివృద్ధికి దిక్సూచి సీఎం కేసీఆర్ అని జడ్పీ చైర్‌పర్సన్ అనితరెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని హైతాబాద్, పెదవేడు, దామర్లపల్లి, లింగారెడ్డిగూడ తదితర గ్రామాలల్లో పల్లెపల్లెకు అవినాష్ అన్న కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు.

అనంతరం ఆమెకు జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తో ఘనంగా స్వాగతం పలికారు. ఆనంతరం ఆయా గ్రామాలల్లో టిఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే ఇతర రాష్ట్రాలల్లో ప్రవేశపెడుతున్నట్లు గుర్తు చేశారు. పల్లెపల్లె కార్యక్రమం కార్యకర్తలలో మనోధైర్యాన్ని పెంచుతున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి కేసీఆర్‌నే వచ్చే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News