Monday, December 23, 2024

పేదింటి ఆడబిడ్డలకు పెద్దన్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:నిడమనూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష 116 రూపాయల చొప్పున కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు ఎమ్మెల్యే నోముల భగత్ చేతులమీదుగా అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. గతంలో పేద ఆడబిడ్డల పెళ్లిళ్లు చేయాలంటే వారి తల్లి తండ్రులు మెడలో పుస్తెలతాడులు అమ్ముకొని పెళ్లిళ్లు చేయాల్సిన పరిస్థితి వచ్చేది అన్నారు.

తెలంగాణ సాధించుకున్న తర్వాత తల్లిదండ్రులకు, ఆడపిల్లలు భారం కావొద్దని సీఎం కేసీఆర్ మేనమామ రూపంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల ద్వారా ఒక లక్ష 116 రూపాయల చెక్కులను అందజేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు. గతంలో పాలించిన ము ఖ్యమంత్రులు పేద ప్రజల గురించి ఏనాడూ ఆలోచించలేదన్నారు. గత ంలో మంచినీళ్లు కావాలంటే బిందెలు ఎత్తుకొని కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది అన్నారు. ఇప్పుడు కేసీఆర్ పాలనలో ఆ ఇబ్బంది లే కుండా ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు అందిస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.

కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్టు, మిషన్ భగీరథ, ఆసరా పెన్షన్లు, దళితబంధు, వ్యవసాయానికి ఉచిత 24 గంటల కరెంటు ఇలాంటి పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గతంలో నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని పాలించిన నాయకుడు ఏనాడు ప్రజలను పట్టించుకోలేదు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు ప్రజలే బుద్ది చెప్పాలి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ని మీ చల్లని మనసుతో ఆశీర్వదిస్తే రాబోయే రోజుల్లో పేదల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ బొల్లం జయమ్మ, డిసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, రాష్ట్ర నాయకులు చేకూరి హనుమంతురావు, మార్కెట్ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తాటి సత్యపాల్, ఎంపీపీ సలహాదారుడు బొల్లం రవి, రైతు సంఘం అధ్యక్షుడు బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ మెరుగు రామలింగయ్య, సర్పంచులు కేశ శంకర్, వంక బ్రమన్న, జంగిలి రాములు, గుడిసె శంకర్ ,మాజీ వైస్ ఎంపీపీ ఉన్నం చిన వీరయ్య, దేవస్థాన కమిటీ చైర్మన్ మేరెడ్డి వెంకటరమణ, బొల్లం సైదులు, వంశీ, పగిళ్ళ శివ, శ్రీను, తిమ్మిశెట్టి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News