మరిపెడ: మనసున్న మహారాజు సిఎం కెసిఆర్ అని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తూ, దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. శుక్రవారం ఆయన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట, లకా్ష్మతండా, సోమ్లాతండా, బోట్యాతండా గ్రామ పంచాయితీల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డిఎస్ రవిచంద్రలతో కలిసి శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా ఆయా గ్రామాల్లో బిఆర్‌ఎస్ శ్రేణులు ఎమ్మెల్యేకు బతుకమ్మలు, బోనాలు, కోలాటాలు, నృత్యాలు, డాన్స్‌లతో పూలు చల్లుకుంటూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎల్లంపేట సర్పంచ్ తాళ్లపెల్లి శ్రీనివాస్, లకా్ష్మతండా సర్పంచ్ బానోతు సుజాత శంకర్‌నాయక్, బోట్యాతండా సర్పంచ్ డిఎస్ అనురాధ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం పథకాల అమలులో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని, ఇదంతా సిఎం కెసిఆర్‌తోనే సాధ్యమైందన్నారు.
కార్యకర్తలే నా బలం.. ప్రజలే నా బలగమని అన్నారు. సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇంటింటికి అందాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందన్నారు. రైతు సంక్షేమమే సిఎం కెసిఆర్ ధ్యేయమని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో లక్షలాది ఎకరాలకు గోదావరి జలాలు అందుతున్నాయని తెలిపారు. స్వరాష్ట్రం ఏర్పడిన కొద్ది నెలల్లోనే విద్యుత్ ఉత్పత్తి పెంచడంతో పాటు వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ ఇస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు. అన్నదాతల కోసం రైతు బంధు, రైతు భీమా పథకాలు అమలు చేస్తూ రైతును రాజుగా మారుస్తున్న నేత సిఎం కెసిఆర్ అన్నారు. రైతులు పండించి పంటలను సైతం రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. పేదల సంక్షేమం కోసం ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కెసిఆర్ కిట్ వంటి అనేక పథకాలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. తెలంగాణ పథకాలను పార్టీలకు అతీతంగా అందిస్తున్నామన్నారు.
ఇంటి జాగలు ఉన్న అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇస్తామని, అర్హులైన వారికి దళిత బంధు పథకం కింద యూనిట్లు అందజేస్తామన్నారు. గ్రామాల్లో ఉన్న తాగునీరు, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను అదేశించారు. కెసిఆర్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి బిఆర్‌ఎస్ పార్టీని ఆదరించాలన్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఈ తొమ్మిదేళ్లలో అన్ని వర్గాలకు సిఎం కెసిఆర్ న్యాయం చేశారని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్షంగా అహర్నిశలు కృషి చేస్తున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వాని ప్రజలు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్, జడ్‌పిటిసి తేజావత్ శారధా రవీందర్‌నాయక్, బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు కుడితి మహేందర్‌రెడ్డి, గుగులోతు వెంకన్న, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు తాళ్లపెల్లి శ్రీనివాస్, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు తాళ్లపెల్లి రఘు, పిఏసిఎస్ వైస్ చైర్మన్ గండి మహేష్, గుగులోతు రాంబాబునాయక్, తేజావత్ రవీందర్‌నాయక్, అయూబ్‌పాషా, ఉప సర్పంచ్ మంజుల రవినాయక్, గ్రామ పార్టీ అధ్యక్షులు రాగం రమేష్, నాగార్జున, నాయకులు దేవేందర్, డిఎస్ రవి, చంద్యానాయక్, ఎంపిటిసిలు, తహశీల్ధార్ పిల్లి రాంప్రసాద్, ఎంపిడిఓ కేలోతు ధన్‌సింగ్, ఎంపిఓ పూర్ణచందర్‌రెడ్డి, పిఆర్ ఏఈ శ్రీనివాస్, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.