Monday, December 23, 2024

దళితుల సంక్షేమానికి సిఎం కెసిఆర్ పెద్దపీట

- Advertisement -
- Advertisement -
  • సంక్షేమ పధకాలతో జనం చూపు బిఆర్‌ఎస్ వైపు
  • ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి

గజ్వేల్: తెలంగాణ రాష్ట్రంలో దళితుల కుటుంబాల సంక్షేమానికి సిఎం కెసిఆర్ పెద్ద పీఅట వేస్తున్నట్లు ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గజ్వేల్ పట్టణంలోని సిఎం క్యాంపు కార్యాలయంలో గురువారం వర్గల్ మండలం గిర్మాపూర్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిఆర్‌ఎస్‌లో చేరారు. ఎఫ్‌డిసి ఛైర్మన్ సమక్షంలో జరిగిన ఈ చేరికల సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, గజ్వేల్ నియోకవర్గంలోని 19వేల దళిత కుటుంబాలకు దశల వారీగా దళిత బంధు పధకాన్ని వర్తింప చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే లక్షంగా సిఎం కెసిఆర్ రైతు బంధు, రైతుబీమా, కెసిఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి,షాదీముబారక్ తదితర పథకాలను వర్తింప చేస్తుండటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. పేద మైనారిటీలక కూడా రూ. లక్ష ఆర్థిక సాయం అందించటంతో పాటు మహిళలకు కుట్టుమిషన్‌లు అందించేందుకు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయటమే లక్షంగా సిఎం కెసిర్ ఒక నిర్ణీత ప్రణాళికా బద్ధంగా ముందుకు పోతుండగా జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నట్లు ఆయన ఆ పార్టీల వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా గిర్మాపూర్ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతాపరెడ్డి గులాబీ కండువాలు కప్పి బిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వర్గల్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకట రెడ్డి, జడ్పిటిసి బాలుయాదవ్, ఎంపిపి లతా రమేష్ గౌడ్,వైస్ ప్రెసిడెంట్ కడపల బాల్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, బిసి సెల్ అధ్యక్షుడు మురళీ గౌడ్, బూంరెడ్డి, యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News