గద్వాల ప్రతినిధి: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు పెన్షన్లు అందజేస్తోందని, సిఎం కెసిఆర్ దివ్యాంగుల పెన్షన్‌లతో వారి జీవితాల్లో వెలుగులు నింపి, భరోసా కల్పించారని గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ అన్నారు. గురువారం గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు పెంచిన రూ.4,016 పెన్షన్‌ల ప్రొసిడింగ్ పత్రాలలను పంపిణీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ… దివ్యాంగుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడ లేని విధంగా గడిచిన తొమ్మిది ఏళ్లలో పదివేల కోట్లు ఖర్చుపెట్టిన ఘనత సిఎం కెసిఆర్‌ది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. దివ్యాంగులకు తెలంగాణ స్వర్ణయుగంగా మారిందని అభివర్ణించారు.
దివ్యాంగుల పెన్షన్ రూ.4,016కు పెంచిన సిఎం కెసిఆర్‌ది చల్లని మనస్సు అని అన్నారు. దివ్యాంగుల అవసరాలు తెలుసుకొని వారికి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాల నాయకులు వేషాలు వేసుకొని గ్రామాలలో పర్యటిస్తున్నారని, వారి చెప్పే మాటలు నమ్మోదని, సిఎం కెసిఆర్ పాలనతే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలంటే ప్రతి ఒక్కరూ బిఆర్‌ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో గద్వాల పీఏసీయస్ చైర్మన్ సుభాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్‌గౌడ, జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, ఎంపీపీలు రాజారెడ్డి, విజయ్, జడ్పీటీసీలు పద్మా వెంకటేశ్వర్‌రెడ్డి,రాజశేఖర్, ప్రభాకర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, డీఆర్‌డీఏ జిల్లా అధికారులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.