Thursday, January 23, 2025

మనకు అండగా ఉండే నాయకుడు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

దమ్మపేట: మనకు అండగా ఉండే నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని, మళ్ళీ ఆయన్ను దీవించాల్సిన అవసరం ఉందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శనివారం మండల కేంద్రమైన దమ్మపేట రెవెన్యూ కార్యాలయంలో మండలానికి మంజూరైన రూ. 44,05,104/-లు విలువచేసే 44 కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన లబ్ధ్దిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్ర జలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యమంత్రి కెసిఆర్ దేశంలో ఎక్కడా లేని పథకాలు మన రాష్ట్రంలో అమలుచేస్తున్నారని, దమ్మపేట మండలంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల రూపంలో సుమారు రూ. 14 కోట్లు ఇవ్వటం జరిగిందని, వ్యక్తిగతంగా అండగా నిలిచిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని, రాబోయే రోజుల్లో మళ్ళీ 3వ సారి బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని, తద్వారా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ స్వామి, ఎండిఓ ఆర్‌సిహెచ్. నాగేశ్వరరావు, దమ్మపేట మండల పశువైద్యాధికారి మన్యం రమేష్‌బాబు, స్థానిక సర్పంచ్‌లు ఉయ్యాల చిన్న వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ దారా యుగంధర్, మందలపల్లి సర్పంచ్ మడివి దుర్గా, మల్కారం సర్పంచ్ రూప్‌సింగ్, వైస్ ఎంపిపి దారా మల్లికార్జునరావు, ఎంపిటిసి దేవులపల్లి పెద్ద బుజ్జి, కోఆప్షన్ సభ్యులు ఎస్‌కె. బుడే, టీఆర్‌ఎస్ పట్టణ కార్యదర్శి యార్లగడ్డ బాబు, బిఆర్‌ఎస్ మండల కార్యదర్శి దొడ్డా రమేష్, పానుగంటి చిట్టిబాబు, మాజీ ఎంపిటిసి జలగం వాసు, మాజీ సర్పంచ్ రావుల శ్రీనివాసరావు, నాయకులు గాజుబోయిన ఏసుబాబు, అబ్దుల్ జిన్నా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News