Sunday, December 22, 2024

వర్షంలోనే సిఎం కెసిఆర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

CM KCR visit Bhadrachalam in rain

హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది వరద ముంపు పరిస్థితులు, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని తగిన సహాయ కార్యక్రమాలు అందించేందుకు నిన్న వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం ఉదయం భద్రాచలం పర్యటనకు బయలుదేరారు. వర్షాలు కురుస్తుండటంతో, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ లో ఏరియల్ సర్వేను అధికారులు రద్దుచేసిన నేపథ్యంలో బాధిత ప్రజలకు చేరుకోవడానికి సిఎం కెసిఆర్ రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు. ములుగు, ఏటూరునాగారం మీదుగా వరద పరిస్థితులను వీక్షిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకుంటూ భారీ వర్షంలోనే సిఎం కాన్వాయ్ ప్రయాణం కొనసాగింది. కెసిఆర్ తో సహా ప్రయాణిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నతాధికారుల బృందం భద్రాచలానికి చేరుకునున్నారు. అక్కడ ముంపుకు గురైన ప్రాంతాలను సిఎం కెసిఆర్ పరిశీలించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News