Friday, December 20, 2024

సీఎం కేసీఆర్ దార్శనికతతో పనిచేస్తున్నారు

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : క్షేత్రస్థాయి నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు, ఉత్తీర్ణిత శాతం మెరుగుపర్చడం, అభివృద్దికి సీఎం కేసీఆర్ దార్శనికత, ముందుచూపుతో పనిచేస్తున్నారని రాష్ట్ర శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు పేర్కొన్నారు. పేదలకు ఉచిత విద్యానందించేందుకు అనేక గురుకులాల ఏర్పాటు, ఉన్నత విద్యానభ్యసించేందుకు విదేశాలకు వెళ్లేందుకు రూ. 20 లక్షలతో చదువుపరంగా ప్రొత్సాహిస్తున్నారని కొనియాడారు.

మంగళవారం విజయనగర్ కాలనీలో ప్రభుత్వ స్కూల్‌లో విద్యార్థుల సౌకర్యార్దం అదనపు గదులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణలో వివిధ వర్గాల విద్యాభివృద్దికి కేసీఆర్ కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సర్కార్ పాఠశాలలోమౌలిక వసతులు మెరుగుపర్చి వారిని విద్యపరంగా ప్రొత్సాహిస్తోందన్నారు. గతంలో సర్కార్లు చేయలేని పనులను అనేకం కేసీఆర్ ఏలుబడిలో జరిగాయని, దీంతో ప్రజలు హర్షిస్తున్నారన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యల వల్లనే సర్కార్ విద్యాసంస్థల్లో ఉత్తీర్ణిత ప్రమాణాలు మరింత అధికమయ్యావన్నారు. నాంపల్లి నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జీ సీహెచ్ ఆనందకుమార్‌గౌడ్, పార్టీ విజయనగర్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు గోప అభిషేక్ రాజ్, సీనియర్ నాయకులు చింతకుంట సంజయ్, మాజీద్ భాయి, ఆశ్వీన్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News