- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్ వైద్య, ఆరోగ్యశాఖను అప్రమత్తం చేశారు. దేశంలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్న తరుణంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకోవాలని ఆదేశించారు. గాంధీ, టిమ్స్ లాంటి పేషంట్లు ఎక్కువగా ఆస్పత్రుల్లో ఫైర్ ఇంజన్లు పెట్టాలని అధికారులను ఆదేశించారు. సిఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఈటల రాజేందర్ అలర్ట్ చేశారు. కరోనా లక్షణాలు ఉంటే నిర్ధారణ పరీక్షతో సంబంధం లేకుండా చికిత్స చేయించుకోవాలన్నారు. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందివ్వాలన్నారు.
CM KCR key directives to medical and health department
- Advertisement -