Friday, December 20, 2024

ఎకరానికి రూ.10 వేలు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: వడగండ్ల వానతో పంటలు దెబ్బతినడంతో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, రైతులకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం కెసిఆర్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటిస్తున్నారు. బోనకల్లు మండలం రావినూతలలో వడగండ్ల వాను దెబ్బతిన్న పంటలను కెసిఆర్ పరిశీలించారు. విహంగ వీక్షణం ద్వారా పంటలను పరిశీలించారు. వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులన పరామర్శించారు. రైతులను పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. 32 ఎకరాల్లో మొక్క జోన్న సాగుచేస్తే 20 ఎకరాల్లో నష్టం జరిగిందని రైతులు పేర్కొన్నారు. ఎకరాకు రూ.50 వేలు పరిహారం అందించాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని, తలసరి ఆదాయం రూ.3.05 లక్షలకు చేరుకుందన్నారు.

మోడీ ప్రభుత్వానికి నివేదిక పంపించదలచుకోలేదన్నారు. గతంలో కేంద్రానికి నివేదిక ఇస్తే నయాపైసా ఇవ్వలేదని మండిపడ్డారు. దీనికి నిరసనగా కేంద్రానికి నివేదిక పంపించడంలేదన్నారు. పంట నష్టపోయిన రైతులు నిరాశ చెందవద్దని సూచించారు. కౌలు రైతులు ఆదుకునేందుకు ఆదేశాలు ఇస్తామని, ఎకరానికి పది వేల రూపాయలు పరిహారం ఇస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. దేశానికి కొత్త వ్యవసాయ పాలసీ అవసరం ఉందని, దేశంలో రైతులకు ఉపయోగపడే పాలసీలు ఎందుకు లేవని కెసిఆర్ ప్రశ్నించారు. ఇప్పుడున్న కేంద్ర విధానం ప్రకారం రైతులకు చిల్లిగవ్వ కూడా రాదన్నారు. తెలంగాణలో భారీ పెట్టుబడులతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశామని, కొత్త ప్రాజెక్టులను కూడా వేగంగా పూర్తి చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News