హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా పడింది. మంగళవారానికి బదులుగా కేసీఆర్ బుధవారం కొండగట్టులో పర్యటించనున్నారు. మంగళవారం కొండగట్టులో భక్తుల రద్దీ దృష్ట్యా బుధవారానికి వాయిదా వేశారు. కేసీఆర్ పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
బుధవారం ఉదయం సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. అనంతరం కొండగట్టును ఆలయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. కోనేరు పుష్కరిణి, కొండలరాయుని గుట్ట, సీతమ్మ వారి కన్నీటిధార, భేతాళ స్వామి ఆలయంతో పాటు తదితర ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు. ఆలయాన్ని పరిశీలించిన అనంతరం జేఎన్టీయూ క్యాంపస్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అక్కడే మీడియాతో కూడా మాట్లాడనున్నారు. ఇక సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాషా పరిశీలించారు.