అనేక సందేహాలకు
కృష్ణతత్వంతో సమాధానాలు
ప్రజలకు సిఎం కెసిఆర్ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణభగవానుని జన్మదినం హిందువులకు పర్వదినమని అన్నారు. గోకులాష్టమిగా, ఉట్ల పండుగగా ప్రజలు జరుపుకునే శ్రీ కృష్ణుని జన్మదినానికి పు రాణ ఇతిహాసాల్లో ప్రత్యేకత ఉందన్నా రు. భారతీయ హిందూ ఆధ్యాత్మిక, సా మాజిక, రాజకీయ జీవన విధానంలో శ్రీ కృష్ణుని తాత్వికత అత్యంత ప్రత్యేకమైనదీ, ప్రభావశీలమైనదని సిఎం తెలి పారు. నేటి సాంకేతిక యుగంలో అనేక రకాల ఒత్తిళ్లకు గురవుతూ, సమ య సందర్భానుసారంగా సరైన నిర్ణయాలను తీసుకోలేకపోతున్న నేటి యువత శ్రీకృష్ణుని జీవన ప్రయాణాన్ని లోతుగా అవగాహన చేసుకోవాల్సి ఉందన్నారు. మానవ సామాన్య మస్తిష్కం అర్థం చేసుకోలేని అనేక సందే హాలకు కృష్ణతత్వంలో సమాధానాలున్నాయన్నారు. నైరూప్యమానమైన శ్రీకృష్ణలీలల్లో పలు కోణాల్లో పరమార్థం దాగివుంటుందని సంక్షేమం కోసం, రాగద్వేషాలకు అతీతంగా శాంతి సౌభ్రాతృత్వ భావనలను వికసించేలా గీతాచార్యులు అనుసరించిన రాజకీయ పాలనా పరమైన నిర్ణయాలు, విధానాలు, బోధనలు ప్రాత:స్మరణీయమన్నారు. క ష్ట సుఖాలు, మంచి చెడులు, లాభనష్టాలకు అతీతంగా అన్ని సందర్భాల్లో నూ, ఒకే విధమైన ప్రవర్తనను కలిగివుండే స్థితప్రజ్జతను సాధించడం శ్రీ కృష్ణతత్వంలోని పరమార్థమని తెలిపారు. సాధించడం ద్వా రా మాత్రమే లక్ష్యాన్ని ఛేదించి గమ్యాన్ని ముద్దాడతామనే శ్రీకృష్ణుని కా ర్యాచరణ ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని సిఎం కెసిఆర్ తెలిపారు.