Friday, December 27, 2024

మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్

- Advertisement -
- Advertisement -

జగిత్యాల జిల్లా కేంద్రంలో 510 కోట్లతో నిర్మించే వైద్య కళాశాల భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవానికి జగిత్యాల జిల్లాకు విచ్చేసిన సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , సీఎస్ సోమేష్ కుమార్ లకు జిల్లా కలెక్టర్ జి.రవి , ఎస్పీ సింధూ శర్మ, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లాలో 510 కోట్లతో నూతన వైద్య కళాశాల, అనుబంధ ఆసుపత్రి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించడం జరిగింది.ప్రభుత్వం జగిత్యాల జిల్లాలో మంజూరు చేసిన వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం తరగతుల నిర్వహించేందుకు 14 కోట్ల వ్యయంతో తాత్కాలిక ఏర్పాట్లను చేసి నవంబర్ 15 నుంచి తరగతులను ప్రారంభించారు. జిల్లాలోని థరూర్ క్యాంపులో 8.6 ఎకరాలలో శాశ్వత వైద్య కళాశాల భవనం, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, కళాశాల సిబ్బంది క్వార్టర్స్, అతిథి గృహం నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను 119.85 కోట్లకు ప్రభుత్వం పూర్తిచేసి సీఎం కేసీఆర్ తో పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైద్య విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్, మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి రాజ్యసభ సభ్యులు పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేష్ నేతకాని, శాసనమండలి సభ్యులు టి. భాను ప్రసాద్ రావు, ఎల్ .రమణ , సిజెడ్పి దావా వసంత, మున్సిపల్ చైర్మైన్, ఎమ్మెల్యేలు, వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ అలీ మర్తుజా రిజ్వి, వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ శ్వేతా మహంతి,ఆర్&బీ కార్యదర్శి ఎస్. శ్రీనివాసరాజు, శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ,కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ,సుంకే రవిశంకర్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, వైద్య విద్య సంచాలకులు రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్ లు బి ఎస్ లత, మంద మకరందు, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News