Wednesday, January 22, 2025

ఐటీ కంపెనీలు వచ్చే ఏర్పాట్లు చేస్తాం..

- Advertisement -
- Advertisement -

పటాన్‌చెరుకు పరిశ్రమలు బాగా నడుస్తున్నయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన సిఎం కెసిఆర్ పటాన్‌ చెరులో రూ.183 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం మాట్లాడారు. కండ్ల అద్దాలు తయారు చేసే.. మెడికల్ డివైజెస్ పార్క్ వస్తే.. ఆ ఒక్క పార్కులో 15 వేల మంది పని చేస్తున్నారని చెప్పడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పటాన్‌చెరు ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఇక్కడికి ఐటీ మంత్రి కెటిఆర్‌ను పంపిస్తానని, త్వరలో ఐటీ కంపెనీలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మాజీ సీఎస్ రాజీవ్శర్మకు పదవీ విరమణ చేశాక తన కోరిక మేరకు పొల్యూషన్ బోర్డ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారని, ఈ ప్రాంతంలో పొల్యూషన్ రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఇక్కడ సూపర్ స్పెషల్ హాస్పిటల్ వచ్చేలా రాజీవ్ శర్మ చొరవ చూపారని కొనియాడారు. మనం కడుతున్న డబుల్ బెడ్రూం ఇండ్లు భారత్‌లో ఎక్కడా ఉండవని, మంచినీళ్ల సరఫరా ఎక్కడా కనిపించదని, అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొని రాష్ట్రంలో నీళ్ల కరువు లేకుండా మటుమాయం చేసుకున్నామన్నారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News