Wednesday, November 6, 2024

మతపిచ్చి ఓ కేన్సర్

- Advertisement -
- Advertisement -

ఎట్టి పరిస్థితుల్లోనూ దాని బారిన పడొద్దు

తాత్కాలికంగా అది అనిపించినా శాశ్వత ప్రయోజనాలు దెబ్బతింటాయి
ప్రశాంతమైన వాతావరణం లేకపోతే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయా?

టిమ్స్ ఆస్పత్రుల్లో
పేదలకు ఉచితంగా
కార్పొరేట్ స్థాయి
వైద్యం ఇండియాలో
కరెంట్ ఉంటే వార్త ..
తెలంగాణలో కరెంట్
పోతే వార్త ప్రజల
మద్దతుతోనే ఇన్ని
కార్యక్రమాలు ప్రజల
దీవెన ఇదేవిధంగా
కొనసాగాలి:
కె.చంద్రశేఖర్‌రావు
ఎల్.బి.నగర్, ఎర్రగడ్డ,
అల్వాల్‌లో నిర్మించనున్న
మూడు టిమ్స్
హాస్పిటళ్లకు ముఖ్యమంత్రి
శంకుస్థాపన

మనతెలంగాణ/హైదరాబాద్ : అన్ని మతాలు, కులాలను ఆదరించే దేశం మనదని.. కొందరు మాత్రం కులం, మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. అది కేన్సర్ జబ్బులాంటిదని పుకసా రి వస్తే చాలా ప్రమాదకరమని చెప్పా రు. అలాంటి కేన్సర్ మన దగ్గర తె చ్చుకోవద్దు. మత పిచ్చి అనే కేన్సర్ ను మన మీద పెట్టుకోవద్దు. తెలంగాణ బిడ్డగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గా, దేశ రాజకీయాల్లో ఒక సీనియర్ రాజకీయ చెప్పాల్సిన బాధ్యత తనపై ఉన్నదని వ్యాఖ్యానించారు. తాత్కాలికంగా అ వి గమ్మత్తుగా అనిపించినా శాశ్వత ప్రయోజనాలు దెబ్బతింటాయని పే ర్కొన్నారు. అన్ని కులాలు, మతాల ను ఆదరించే పరిస్థితిని చెడగొడితే ఎటూ కాకుండా పోతామని వ్యాఖ్యానించారు. రాజధాని నలుమూలల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ని ర్మాణానికి ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రీకారం చుట్టారు. ఎ ర్రగడ్డ, అల్వాల్‌లో నిర్మించనున్న మ రో మూడు టిమ్స్ హాస్పిటళ్లకు మం గళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అల్వాల్‌లో నిర్వహించి న సభలో ముఖ్యమంత్రి మాట్లాడా రు.

కులమతాల పేరుతో రాజకీయా లు చేసేవారిని ప్రజలు గమనించాలని కోరారు. వాళ్ల షాపులో పూలు కొనద్దు.. ఫలానా వాళ్ల షాపు లో ఇది కొనద్దు, అది కొ నద్దు అని కొందరు మత విద్వేషంతో మాట్లాడుతూ ఉన్నారని విమర్శించారు. మ న దేశానికి చెందిన సుమారు 13కోట్ల మంది విదేశాల్లో పనిచేస్తున్నారని, అక్కడి ప్రభుత్వాలు వాళ్లని వెనక్కి పంపితే వారికి ఉద్యోగాలు ఎ వరివ్వాలి? అని ప్రశ్నించారు. ప్ర జ లు ఈ విషయాలను ఆలోచించాల్సి న అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ఏడేళ్లలో హైదరాబాద్‌లో 2.30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, 10 నుంచి 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలిగాయని వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌లో 14వేల ఎకరాల్లో ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ప్రపంచానికే వ్యాక్సిన్ల రాజధానిగా హైదరాబాద్ ఉందని, జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ సంస్థలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశవిదేశాల వాళ్లు ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తున్నారని, హైదరాబాద్‌లో ప్రశాంతమైన వాతావరణం లేకపోతే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయా..? అని ప్రశ్నించారు. మతం, కులం పేరుతో కొట్లాటలు, కర్ఫ్యూలు ఉంటే పెట్టుబడులకు ఎవరూ ముందుకు రారని అన్నారు.

పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం

మిగతా పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సభలు జరుపుతుంటే… మనం మాత్రం ఆరోగ్యానికి సంబంధించిన సభ జరుపుకుంటున్నామని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఇదే వాళ్లకీ మనకీ తేడా అని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్యవిధానాన్ని పటిష్టం చేస్తున్నామని, దీనిలో భాగంగానే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. టిమ్స్ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని తెలిపారు.ఈ ఆస్పత్రుల్లో ఎయిమ్స్ తరహా సేవలు అందుతాయని స్పష్టం చేశారు. ఈ ఆసుపత్రుల్లో 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. పేదరికం కారణంగా ప్రజలు వైద్యానికి దూరం కాకూడదని పేర్కొన్నారు. అల్వాల్ టీమ్స్ ప్రసూతి సేవల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. కరోనా లాంటి వైరస్‌లు భవిష్యత్‌లోనూ వచ్చే ప్రమాదముందని తెలిపారు. హైదరాబాద్ నగరంపై ఒత్తిడి పెరుగుతున్నందున ఎయిమ్స్ తరహాలో టిమ్స్ ఆస్పత్రులను తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. కేవలం గాంధీ, ఉస్మానియా, నీలోఫర్‌పైనే ఆధారపడకుండా నగరానికి నలువైపులా వీటిని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పడకలు, సదుపాయాలు పెంచినట్లు కెసిఆర్ తెలిపారు.

తెలంగాణలో కరెంట్ పోతే వార్త

మనది పసికూన రాష్ట్రమైనా అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని సిఎం కెసిఆర్ వెల్లడించారు. గుజరాత్, మహారాష్ట్ర తదితర పెద్ద రాష్ట్రాల కంటే మన తలసరి ఆదాయం ఎక్కువ అని పేర్కొన్నారు. తెలంగాణ తరహా పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవని తెలిపారు. ఇండియాలో కరెంట్ ఉంటే వార్త .. తెలంగాణలో కరెంట్ పోతే వార్త అని సిఎం వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో రైతులు రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, మిషన్ భగీరథతో మంచినీటి కొరత తీర్చుకున్నామని తెలిపారు. సాగునీటి రంగంలో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నామని, వైద్యం, విద్యపై రాబోయే రోజుల్లో దృష్టి పెట్టబోతున్నట్లు సిఎం తెలిపారు. ప్రజల మద్దతుతోనే ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ప్రజల దీవెన ఇదేవిధంగా కొనసాగాలి .. తెలంగాణ మరింత పచ్చబడాలని ఆకాంక్షించారు. దుష్టశక్తుల బారి నుంచి ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని ముందుకెళ్తామని సిఎం కెసిఆర్ అన్నారు.

ఇంత ప్రగతిని మనమే చేసినమంటే గర్వంగా ఉంది

ఒక నగరంగానీ, ఒక రాష్ట్రం గానీ, ఒక దేశం గానీ ఎవరికైతే పటిష్టమైనటువంటి వైద్య వ్యవస్థ ఉంటుందో వాళ్ళు తక్కువ నష్టంతోని బయట పడతారని సిఎం అన్నారు. ఎవరికైతే వైద్య వ్యవస్థ బాగుడందో వారు నష్టాలకు గురై లక్షలమంది చనిపోతారని పేర్కొన్నారు. వైరస్‌లను మొత్తం ఫినిష్ చేసే మెకానిజం ఇప్పటికీ ప్రపంచంలో లేదని, కంట్రోల్ చేసే వైద్య విధానం ఉందని చెప్పారు. వైద్య విధానాన్ని పటిష్టం చేసే విధానంలో మన రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా పేదల కోసం, ఇబ్బందులు పడే వారి కోసం పలు చర్యలు తీసుకున్నదని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఇదంతా మనమే చేశామా అని ఆశ్చర్యం కలుగుతుందని,. ఊహించనటువంటి కార్యక్రమాలు చేశామని పేర్కొన్నారు.

మనది మానవీయ ప్రభుత్వం..

హైదరాబాద్‌కు వైద్యం కోసం వచ్చిన వారు దురదృష్టవశాత్తూ మరణిస్తే వాళ్ళను ప్రభుత్వ అంబులెన్సులో ఇంటి కాడ వదలిపెట్టి రమ్మనమని చెప్పినం అని కెసిఆర్ పేర్కొన్నారు. ఇది ఇండియాలో కాదు, అమెరికాలో, లండన్‌లో ఎక్కడా లేదని చెప్పారు. మానవీయ కోణంతో పనిచేసే ప్రభుత్వం మనదని స్పష్టం చేశారు. చాలా కష్టపడి, పోరాడి, ఆరు దశాబ్దాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టీ దీన్ని అన్ని రకాలుగా, అన్ని రంగాల్లో పటిష్టపరచాలే కాబట్టీ సరైన పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నామన్నారు.

పరమత సహనమే భారతీయ తత్వం..
హైద్రాబాద్ శాంతి సామరస్యాలకు కేంద్రం :

“హైదరాబాద్ పోతే విమానం దిగినా, రైలు దిగినా, బస్సు దిగినా ప్రశాంతంగా ఉంటుంది. బాగా ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల భోజనం దొరుకుతుంది. అన్ని భాషలు మాట్లాడేవారుంటరు. అందరు కలిసి బ్రతుకుతారు. కానీ… హైదరాబాద్‌లో దిగుతూనే కత్తులు పట్టుకుంటారు. తుపాకులు పట్టుకుంటారు. 144 సెక్షన్ పెడతారు. కర్ఫ్యూ ఉంటుంది. పొద్దున లేస్తే తన్నుకుంటారు…అనే పేరువస్తే … మన దగ్గరికి ఎవరైన వస్తారా. సామరస్యం ఉంటే, శాంతి ఉంటే, లా అండ్ ఆర్డర్ బాగుంటే, మన పోలీస్ శాఖ బాగుంటే వెల్లువలా పెట్టుబడులు వస్తాయ్. పరిశ్రమలు తరలి వస్తాయ్. ఉద్యోగాలు, ఉపాధి దొరకుతుంది. పొద్దున లేస్తే కులం పేరు మీద, మతం పేరు మీద కొట్లాటలు, కర్ఫ్యూలు, ఫైరింగ్‌లు ఉంటే ఎవ్వరు కూడా మన దగ్గరికి రారు. అది మన కాళ్ళు మనం నరుక్కున్నట్టు అవుతుంది.” అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

నూతన రాష్ట్రంలో అందరికీ అభివృద్ధి ఫలాలు :

మనది కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, పసికూన రాష్ట్రమని సిఎం తెలిపారు. ఈ దేశంలో చాలా పెద్ద రాష్ట్రాలున్నాయని, మహారాష్ట్ర కావచ్చు…తమిళనాడు కావచ్చు….కర్ణాటక కావచ్చు… గుజరాత్ కావచ్చు..ఇవన్నీ ఎప్పటి నుంచో రాష్ట్రాలుగా కొనసాగుతున్నాయని, మన తెలంగాణ తలసరి ఆదాయం వీటన్నింటిని మించి నమోదైందని తెలిపారు. ఇంత ప్రగతితో అద్భుతంగా మనం ముందుకు పోతున్నామని, సంపద సృష్టించి, పేదలకు పంచుతున్నామన్నారు. 2016 రూపాయల పెన్షన్ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో తప్ప ఎక్కడ కూడ ఇవ్వరని తెలిపారు. ప్రధానమంత్రి రాష్ట్రం గుజరాత్‌లో కూడా ఇవ్వరని చెప్పారు. దివ్యాంగులకు 3016 రూపాయల పెన్షన్ ఎక్కడ కూడా ఇవ్వరని అన్నారు. ఆడపిల్ల పెండ్లి జరిగితే 1,00,116/- రూపాయలు ఇచ్చే సాంప్రదాయం ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా లేదని అన్నారు.

పుష్కలంగా కరెంటు, సాగు తాగునీల్లు :

“ ప్రధానమంత్రి ప్రాతినిధ్యంవహించే గుజరాత్‌లో కూడా రైతులు రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేస్తున్నారని సిఎం తెలిపారు. కానీ 7 ఏండ్ల క్రితం పుట్టిన పసికూన తెలంగాణ రాష్ట్రంలో రాత్రింబవళ్ళు కష్టపడి 24 గంటల కరెంటు అన్ని రంగాలకు ఇచ్చుకుంటూ ఉన్నామన్నారు. ఎండాకాలం వచ్చిందంటే ఎంఎల్‌ఎల చావుకొచ్చేదని, దారుణమైన పరిస్థితులు ఉండేవని పేర్కొన్నారు. ఏ మూలకు పోయిన బిందెల ప్రదర్శనలు, నిరసనలు, రాస్తారోకోలు జరిగేవని గుర్తు చేశారు. ఇవ్వాల తెలంగాణలో బిందెల ప్రదర్శన ఎక్కడ కూడా లేదని అన్నారు. మిషన్ భగీరథ పుణ్యామా అని మంచినీళ్ళ సమస్య కూడా తీర్చుకున్నామని తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ వంటి పథకాలతో బ్రహ్మాండంగా ముందుకుపోతున్నామని చెప్పారు. ధాన్యం పండించడంలో దేశంలో నెంబర్ వన్ స్థాయికి ఎదుగుతున్నామని, అన్ని రంగాలు బాగుజేసుకుంటూ ముందుకు సాగుతున్నామని కెసిఆర్ తెలిపారు.

వైద్యం విద్య రంగాలకు పెద్ద పీట :

ఇక నుంచి ప్రభుత్వం విద్య, వైద్యం మీద దృష్టిపెట్టబోతున్నదని సిఎం వెల్లడించారు. రాబోయే రోజుల్లో మన గురుకుల పాఠశాలలు మరిన్ని పెరగాలని చెప్పారు. 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసుకోబోతున్నామని, విద్య, వైద్య సేవలు ప్రజలందరికీ అందాలని చెప్పి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.

నాటి పాలకులు పట్టించుకోలేదు : మంత్రి హరీశ్‌రావు

ప్రభుత్వ ఆస్పత్రుల గురించి నాటి పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌కు నలుదిక్కులా మూడు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు భూమిపూజ చేసిన ఈరోజు సువర్ణ దినమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశానికి స్వాత్రంత్యం వచ్చినప్పటి నుంచి జనాభా బాగా పెరిగిందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆస్పత్రుల గురించి గత ప్రభుత్వాలు ఆలోచించలేదని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు ఆస్పత్రులు పుట్టుకొచ్చాయని పేర్కొన్నారు. పెరుగుతున్న అవసరాలు ఓ వైపు,కరోనా లాంటి పరిస్థితులు మరో వైపు అని పేర్కొన్నారు. వరంగల్ హెల్త్ సిటీతో కలిపి దాదాపు 7,500 పడకలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. మూడు టిమ్స్‌లలో 3 వేల ఐసీయూ పడకలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు.ఇది జంట నగరాలకే పరిమితం కాకుండా చుట్టు పక్కల ఉన్న జిల్లాలకు ఉపయోగపడనుందన్నారు.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కావాలని కొట్లాడినా ఆంధ్ర ప్రాంతంలోనే పెట్టారని గుర్తు చేశారు. 1956 నుంచి 2014 వరకు మూడే వైద్యకళాశాలలు వచ్చాయని, కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశానికే ఆదర్శంగా జిల్లాకు ఒకటి చొప్పున 33 ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రకటించారని చెప్పారు. రాబోయే రెండేళ్లలో ఈ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. గతంలో బెంగాల్ ఏం చేస్తే దేశమంతా అదే చేస్తుందనే నానుడి ఉండేదని .. ఇప్పుడు తెలంగాణ ఏం చేస్తే దేశం అదే అనుసరిస్తోందనే నానుడి నిజం అవుతుందని తెలిపారు. సిఎం కెసిఆర్ రైతుబందు ప్రారంభిస్తే దేశమంతా అలాంటి పథకం వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలబడుతుందని చెప్పారు. కొంతమంది నాయకులకు కనీస సోయి కూడా లేదని విమర్శించారు. హైదరాబాద్లో బస్తీ దవాఖానాలు సూపర్‌హిట్ అయ్యాయని అన్నారు. 15 వ ఆర్థిక సంఘం కూడా బస్తీ దవాఖానాలను కొనియాడిందని పేర్కొన్నారు. ఏడేళ్లలోనే డయాలసిస్ సెంటర్లను 3 నుంచి 102 కి పెంచామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

మూడు టిమ్స్ దవాఖానాల శంకుస్థాపన కార్యక్రమాలలో మంత్రులు మహ్మద్ మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీహెచ్ మల్లారెడ్డి,ఎంపీలు, కె.కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, ఎంఎల్‌సిలు ఎగ్గె మల్లేశం, శంభీర్ పూర్ రాజు, కె.నవీన్ రావు, సురభి వాణీదేవి, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, యోగానంద్, ఎంఎల్‌ఎలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, సాయన్న, మైనంపల్లి హన్మంతరావు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య, జైపాల్ యాదవ్, కాలేరు వెంకటేశ్, కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జెడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, లక్ష్మీనారాయణ, రావుల శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపీ ఎస్. వేణుగోపాలాచారి, మాజీ ఎంఎల్‌ఎలు తీగల కృష్ణారెడ్డి, మలిపెద్ది సుధీర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డీ గంగాధర్, డిఎంఇ రమేశ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ అండ్ బి ఇఎన్‌సి గణపతి రెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News