Tuesday, December 17, 2024

భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు బయల్దేరిన సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం మహారాష్ట్రకు బయల్దేరి వెళ్లారు. ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్‌తో సిఎం మహారాష్ట్రకు బయల్దేరారు. సిఎం కన్వాయ్ లో రెండు బస్సులు, 600 వాహనాలు ఉన్నాయి. బిఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా కెసిఆర్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాలను సిఎం దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సిఎం కెసిఆర్ వెంట పలువురు మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బిఆర్‌ఎస్ నేతలు భారీ కాన్వాయ్‌గా తరలి వెళ్లారు.

Also Read: అదరహో… ఆకాశ వంతెన

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News