Saturday, December 21, 2024

ఢిల్లీలో సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Satyavathi Rathod slams Union Ministers over Paddy

ఢిల్లీ వెళ్లిన సిఎం కెసిఆర్
మూడు రోజుల పాటు అక్కడే మకాం
ధాన్యం కొనుగోళ్లపై టిఆర్‌ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి సిఎం బయలుదేరారు. సిఎం కెసిఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత ఉన్నారు. కాగా ప్రభుత్వ వర్గాల నుంచి అందించిన సమాచారం మేరకు మూడు రోజుల పాటు సిఎం కెసిఆర్ ఢిల్లీలో ఉండే అవకాశముందని తెలుస్తోంది. ధాన్యం కొనుగోళ్ల అంశంపై సోమవారం నుంచి వారం రోజుల పాటు కేంద్రంపై ఐదంచెల దండయాత్రకు టిఆర్‌ఎస్ పార్టీ శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్ ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ విషయంలో అవసరమైతే మరోసారి ప్రధాని నరేంద్రమోడీని కలువాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని అపాయింట్‌మెంట్‌ను సిఎంఒ వర్గాలు కోరినట్లు సమాచారం. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం దిగి రానిపక్షంలో ఢిల్లీ వేదికగా బిజెపివ్యతిరేక శక్తులను కెసిఆర్ కూడగట్టనున్నారని తెలుస్తోంది. అలాగే ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు సిఎం కెసిఆర్ దంత వైద్యం చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ చికిత్సలో భాగంగా మరోసారి వైద్యులను కూడా కలువనున్నట్లు సమాచారం. కాగా సిఎం సతీమణి శోభ కూడా ఢిల్లీ ఎయిమ్స్‌లో ప్రత్యేక వైద్య,చికిత్సలు చేయించుకోన్నారని తెలుస్తోంది.

CM KCR Leaves for Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News