Monday, December 23, 2024

బీహార్‌ కి బయలుదేరిన సిఎం కెసిఆర్‌

- Advertisement -
- Advertisement -

CM KCR left for Bihar

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కెసిఆర్‌ బీహార్‌లో పర్యటించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పట్నాకు బయలుదేరి వెళ్లారు. గతంలో ప్రకటించిన విధంగా గల్వాన్‌ లోయలో మరణించిన ఐదుగురు బీహార్‌ సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తారు. అదేవిధంగా సికింద్రాబాద్‌ టింబర్‌ డిపోలో ఇటీవల మరణించిన 12 మంది వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు. బీహార్‌ సిఎం నీతీశ్‌ కుమార్‌తో కలిసి వారికి చెక్కులను అందజేస్తారు. అనంతరం నీతీశ్‌ నివాసానికి వెళ్లి అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. తర్వాత జాతీయ రాజకీయాలు, విపక్ష ప్రభుత్వాలపై బీజేపీ వైఖరి, తదితర అంశాలపై చర్చిస్తారు. సిఎం కెసిఆర్‌ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, జాతీయ రైతు సంఘాల నేతలు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News