Wednesday, January 22, 2025

ఢిల్లీకి బ‌య‌ల్దేరిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైద‌రాబాద్ : సిఎం కెసిఆర్ ఢిల్లీకి బ‌య‌ల్దేరారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో కెసిఆర్ బ‌య‌ల్దేరి వెళ్లారు. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలోని స‌ర్దార్‌ప‌టేట్ మార్గ్‌లో బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాల‌యాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పేరును మార్చినందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటుగా బి ఆర్‌ఎస్ విజయవంతం కావాలనే ఉద్దేశ్యంతో ఈ నెల 13, 14 తేదీల్లో రాజశ్యామల యాగాన్ని నిర్వహించాలని ఆ యన తలపెట్టారు. ఎన్నికలకు ముందు కూడా కెసిఆర్ తన ఫామ్‌హౌస్‌లో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఈ యాగం ముగించుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఆ ఎన్నికల్లో అద్భుత విజయాని సాధించారు.

ఢిల్లీ బాట పట్టిన నేతలు

14వ తేదీన ఢిల్లీలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు తరలి రానున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపి సంతోష్‌కుమార్ ఇప్పటికే శనివారమే ఢిల్లీకి చేరుకున్నారు. ఇక సోమ, మంగళవారాల్లో బిఆర్‌ఎస్ నేతలు పెద్దఎత్తున ఢిల్లీకి చేరుకోనున్నారు.

ఏర్పాట్ల పరిశీలన

ఈనెల 14న దేశ రాజధాని ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు భారత రాష్ట్ర సమితి పార్టీ (బిఆర్‌ఎస్) కేంద్ర కార్యాలయం ప్రారంభించి యాగం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రారంభోత్సవం, యాగం కోసం చేపట్టవలసిన ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా యాగం కోసం ప్రత్యేకంగా నిర్మించాల్సిన యాగశాల స్థలంతో పాటు ఆఫీస్ భవనంలో చేపట్టవలసిన మరమ్మత్తులు, కార్యాలయ ఫర్నిచర్ ఇతర పనులను ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News