Sunday, January 19, 2025

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయల్దేరిన ముఖ్యమంత్రి కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR left for Hyderabad from Delhi

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు బయల్దేరారు. ఆయయన తొమ్మిది రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరైన సిఎం, అక్కడ్నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లిన ముచ్చట తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పలువురు రైతు సంఘాల నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, పలువురు ఎంపిలతో భేటీ అయి చర్చలు జరిపారు. బిఆర్‌ఎస్‌, టిఆర్ఎస్ కార్యాలయాల పనులను ఆయన పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖతో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పరిపాలన, ప్రభుత్వ పథకాల ప్రచారం, నిధుల సమీకరణపై సిఎస్ సోమేశ్ కుమార్‌తో ఢిల్లీలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. బుధవారం మునుగోడు ఉప ఎన్నికపై సిఎం సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News