Friday, November 22, 2024

ఎఫ్‌సిఐని గాడిలో పెట్టండి

- Advertisement -
- Advertisement -

CM KCR letter to PM Narendramodi

రాష్ట్రం నుంచి మొత్తం బియ్యాన్ని కొనుగోలు చేయించండి

పంజాబ్‌తో సమానంగా తెలంగాణ నుంచి కూడా
బియ్యాన్ని సేకరించాలి దేశ ప్రజలకు ఆహార భద్రత
కల్పించవలసిన బాధ్యత గల ఎఫ్‌సిఐ అసంబద్ధ విధానాలను
అవలంబిస్తున్నది రైతులను, రాష్ట్ర ప్రభుత్వాలను
అయోమయానికి గురిచేస్తున్నది రాష్ట్రంలో ఏటా దిగుబడి
పెరుగుతున్నదని తెలిసినా ధాన్య సేకరణ వేగవంతం
చేయటం లేదు కష్టజీవులైన తెలంగాణ రైతులు ప్రభుత్వం
ఇస్తున్న ప్రోత్సాహకాలతో గుణాత్మకంగా దిగుబడి
సాధిస్తున్నారు, దేశ ప్రగతికి తోడ్పడుతున్నారు గతంలో
తెలంగాణలో కరువు కాటకాలు తాండవించాయి పెరిగిన
సాగునీటి లభ్యతతో ఆహార ధాన్యాల దిగుబడిలో ఇప్పుడు
మిగులు రాష్ట్రం అయింది, దేశానికి అన్నపూర్ణగా ఎదిగింది
ఈ విషయం మీకు తెలియనిది కాదు 40లక్షల టన్నుల
సేకరణ పరిమితిని పెంచి 202122 వానాకాలం పంటను
90శాతం సేకరించాలి యాసంగిలో రాష్ట్రం నుంచి
ఎంత కొంటారో ముందే నిర్ధారించాలి
ప్రధాని మోడీకి రాసిన లేఖలో ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్ : బియ్యం కొనుగోలుకు సంబందించి ఎఫ్‌సిఐకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) అసంబద్ధ విధానాల వల్ల రైతులతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తీవ్ర ఆయోమయానికి గురవుతున్నాయన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, రాష్ట్రంలో తయారయ్యే బియ్యాన్ని కేంద్రం పూర్తిగా కొనుగోలు చేయాల్సిందేనని కోరారు. పంజాబ్ తరహాలోనే రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 2020-2021 ఎండాకాలంలో సేకరించకుండా మిగిలి ఉన్న 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా తక్షణమే సేకరించాలని ఆ లేఖలో సిఎం కెసిఆర్ డిమాండ్ చేశారు.

ప్రధాని మోడీకి… సిఎం కెసిఆర్ రాసిన లేఖ యధావిధిగా…

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి, వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది అనేది మీకు తెలిసిన విషయమే. వినూత్న విధానాలతో తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వరుస పథకాల మూలంగానే వ్యవసాయ రంగం ధృఢంగా తయారై ఇంతటి అభివృద్ధి సాధ్యమైంది. 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును పూర్తి ఉచితంగా అందిస్తూ, ఏడాదికి ఎకరానికి 10,000 రూపాయల పంటపెట్టుబడి ప్రోత్సాహకాన్ని తెలంగాణ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. కష్టజీవి అయిన తెలంగాణ రైతు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ గుణాత్మకంగా దిగుబడిని సాధిస్తున్నాడు. తద్వారా దేశ ప్రగతికి దోహదం చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఎక్కడ చూసినా తెలంగాణలో కరువు కాటకమే తాండవించేంది. నేడు రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన సాగునీటి లభ్యత ద్వారా, తెలంగాణ తన అవసరాలను దాటుకుని ఆహార ధాన్యం దిగుబడిలో మిగులు రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణ రైతు నేడు దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన ప్రగతి ప్రస్థానం గురించి మీకు తెలియనిది కాదు. సురక్షిత నిల్వలను కొనసాగిస్తూ, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, గోదుమలు వంటి ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తూ దేశ ప్రజలకు ఆహార భధ్రతను కల్పించే తప్పనిసరి బాధ్యతలను నెరవేర్చాల్సిన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) అసంబద్ధ విధానాలను అవలంబిస్తూ, అటు రైతులను ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను అయోమయానికి గురి చేస్తున్నది.

ఎఫ్ సి ఐ అవలంబిస్తున్న అయోమయ విధానాలు ఏమిటంటే …..

1. ఏడాదికి సరిపడా ధాన్యం సేకరించే లక్ష్యాలను ఒకేసారి నిర్ధారించడం లేదు.

2. ప్రతి ఏటా ధాన్యం దిగుబడి పెరుగుతున్నదని తెలిసినా ధాన్యాన్ని వేగవంతంగా సేకరించడం లేదు.పైన తెల్పిన ఎఫ్‌సిఐ

అయోమయ విధానాల వలన సరియైన పంటల విధానాన్ని రైతులకు వివరించేందుకు రాష్ట్రాలకు ప్రతిబంధకంగా మారింది. ఉదాహరణకు 2020.. 2021 వానాకాలం సీజన్‌లో తెలంగాణలో 55.75 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి అయింది. కానీ అందులో కేవలం 32.66 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే ఎఫ్‌సిఐ సేకరించింది. అంటే పండిన పంటలో కేవలం 59 శాతం ధాన్యం మాత్రమే. ఇది 2019..20-20 వానాకాలంలో సేకరించిన ధాన్యం కంటే 78 శాతం తక్కువ. ధాన్యం సేకరణలో ఇటువంటి విపరీత తేడాలుంటే రాష్ట్రంలో హేతుబద్దమైన పంట విధానాలను అమలు చేయడానికి ఇబ్బందిగా మారుతుంది. ఇటువంటి అయోమయ పరిస్థితులను తొలగించి ధాన్యం సేకరణలో నిర్థిష్టమైన లక్ష్యాన్ని నిర్దారించడం కోసం కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పియూష్ గోయెల్‌ను గత సెప్టెంబర్ 25, 26 తారీఖుల్లో నేనే స్వయంగా వెల్లి కలిసాను. వార్షిక ధాన్య సేకరణ లక్ష్యాన్ని తక్షణమే నిర్దారించాలని నేను విజ్జప్తి చేశాను. కేంద్ర మంత్రికి విజ్జప్తి చేసి 50 రోజులు దాటిపోయినా ఎటువంటి సమాచారం లేదు… ఇంతవరకు ఎటువంటి విధాన నిర్ణయాన్ని తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఎఫ్‌సిఐకి ఈ కింది ఆదేశాలు ఇవ్వాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను.

1. 2020-21 ఎండాకాలం సీజన్లో సేకరించకుండా మిగిలి ఉంచిన 5 లక్షల మెట్రిక్ ట న్నుల వరి ధాన్యాన్ని తక్షణమే సేకరించాలి.

2. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమనే నిబంధనను మరింతగా పెంచి, పంజాబ్ రాష్ట్రంలో మాదిరి తెలంగాణలో కూడా 2021 -22 వానాకాలంలో పండిన పంటలో 905 వరి ధాన్యాన్ని సేకరించాలి.

౩. వచ్చే యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఎంత వరిధాన్యం కొంటుందో ముందుగానే నిర్దారించాలని పేర్కొం టూ… దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ రాశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News