Monday, December 23, 2024

మెడిసిన్ సీట్లు పెంచండి

- Advertisement -
- Advertisement -

CM KCR letter to Prime Minister Modi over Medicine seats

ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల కోసం

ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ

ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులు దేశంలో చదువులు కొనసాగించడానికి అనుమతించండి ప్రత్యేక అంశంగా పరిగణించి ఈ ఒక్క సంవత్సరం వారి కోసం మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచండి 20వేలకు పైగా వైద్య విద్యార్థులు తిరిగొచ్చారు వీరిలో చాలా మంది మధ్యతరగతి వారే తెలంగాణ వారే 700 మందికి పైగా ఉన్నారు వారి విద్యాభ్యాస ఖర్చు భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సీట్లు పెంచుతూ త్వరగా నిర్ణయం తీసుకోండి

మనతెలంగాణ/హై-దరాబాద్: ప్రధాని మోదీకి సిఎం కెసిఆర్ లేఖ రాశారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి అర్ధాంతరంగా భారత్‌కు తిరిగొచ్చిన వైద్య వి ద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని మోదీకి సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంతో ప్రత్యేక కేసుగా పరిగణించి అనుమతి ఇవ్వాలని కోరారు. యుద్ధం కారణంగా దాదాపు 20వేలకు పైగా విద్యార్థులు ఉక్రెయి న్ నుంచి వచ్చారన్న కెసిఆర్… దేశ వ్యాప్తంగా వివిధ వైద్యకళాశాలల్లో వారు చదువుకునేలా నిబంధనలు సడలించి అవకాశం ఇవ్వాలని కోరారు. విద్యార్థుల్లో చాలా మంది మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారని… జీవితాంతం సంపాదించిన డబ్బులతో పిల్లలను వైద్యవిద్య కోసం ఉక్రెయిన్ పంపారని కెసిఆర్ పేర్కొ న్నారు. వారి భవిష్యత్‌ను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆ విద్యార్థులకు సరిపడా సీట్లను ఆయా వైద్యకళాశాలల్లో ఈ ఒ కసారికి పెంచాలని కోరారు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల్లో తెలంగాణకు చెందిన వారు 700 మందికి పైగా ఉన్నారన్న కెసిఆర్… వారి విద్యాభ్యాసం పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్ర భుత్వం భరించేందుకు నిర్ణయించిందని తెలిపారు.

మానవతా దృక్పథంతో వీలైనంత త్వరగా విద్యార్థుల విషయమై నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీని కెసిఆర్ కోరారు. కాగా.. ఉక్రెయిన్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన విద్యార్ధులు ఇటీవల సుప్రీంకోర్టుని ఆశ్రయించిన సంగతి విదితమే. నాలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ విద్యార్ధులున్నారు. ఉక్రెయిన్ లో తాము అసంపూర్తిగా వదిలేసిన కోర్సులను భారత్ లో పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని విద్యార్ధులు కోరుతున్నారు. భారత్ లో ఈ కోర్సులు పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని విద్యార్ధు లు కోరారు. 2 వేల మందికి న్యాయం చేయాలని ఆ పిటిషన్ లో కోరారు. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్ లో విద్యార్ధులు కోరారు. ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించి నెల రోజులు దాటింది. దీంతో ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుకొనేందుకు వెళ్లిన భారత విద్యార్ధులు ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే దదువును మధ్యలోనే వదిలేసి రావాల్సి వచ్చింది.

ఉక్రెయిన్ లో ఇప్పటికిప్పుడే సాధారణ పరిస్థితులు వచ్చేలా లేవు. దీంతో తమ చదువు గురించి వైద్య విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. ఇండియాలోనే తాము చదువుకొనేందుకు అవకాశం కల్పించాలని వైద్య విద్యార్ధులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ చదువు కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టును ఆ పిటిషన్ లో వైద్య విద్యార్ధులు కోరారు. అయితే ఇప్పటికే ఉక్రెయిన్ నుండి తెలంగాణ నుండి వచ్చిన విద్యార్ధులను చదువు కోసం అయ్యే ఖర్చును భరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్య విద్యార్ధుల చదువు విషయంలో సానుకూలంగా స్పందించింది.

ఇకపోతే.. ఉక్రెయిన్ నుండి వచ్చిన వైద్య విద్యార్ధులు ఈ నెల 12న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.తాము వైద్య విద్యను పూర్తి చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు. భారతదేశంలో వైద్య విద్యను పొందే హక్కు, కొనసాగించే హక్కు ఆర్టికల్ 21 ప్రకారం ఉందని పేర్కొన్నారు.ఉక్రెయిన్ నుంచి 20 వేల మంది భారత వైద్య విద్యార్థులు తిరిగి వచ్చారు. యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేనందున వారి చదువుపై అనిశ్చితి నెలకొందని విద్యార్ధుల తరఫున కేసు వేసిన ప్రవాసీ లీగల్ సెల్ పేర్కొంది. కాగా ఉక్రెయిన్‌లో పరిస్థితులు చూసిన తర్వాత మళ్లీ అక్కడికి వెళ్లాలని లేదని, కేంద్ర ప్రభుత్వమే తమకు ఓ దారి చూపుతుందని కొంతమంది విద్యార్థులు భావిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News