Saturday, December 28, 2024

భారీ వర్ష సూచనతో సిఎం పర్యటన వాయిదా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లా పర్యటన షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న మెదక్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా, అదే రోజున భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ మెదక్ జిల్లా పర్యటనను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసినట్లు సిఎంఒ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. మెదక్ జిల్లాలో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాయాలకు సిఎం కెసిఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. దాంతో పాటు బిఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News