Monday, December 23, 2024

ఖమ్మం జిల్లాలో ప్రతి అంగుళానికి నీరు తెచ్చేలా కృషి చేస్తా : సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

 

ఖ‌మ్మం జిల్లాతో పాటు అన్ని క‌రువు ప్రాంతాల‌కు గోదావ‌రి నీటిని అందిస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా నూత‌న క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కెసిఆర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ప్రతి అంగులానికి నీరు తెచ్చేలా కృషి చేస్తానని అన్నారు. సీతారామ ప్రాజెక్టు త్వ‌ర‌లోనే పూర్త‌వుతే ఖమ్మం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. 37 టీఎంసీల నిల్వ‌తో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు.

కృష్ణా న‌దిలో స‌రిప‌డా నీరు లేక‌పోయిన‌ప్ప‌టికీ, సీతారామ ప్రాజెక్టు పూర్త‌యితే నాగార్జున సాగ‌ర్ ఆయ‌క‌ట్టుకు ఢోకా ఉండ‌దు.మర్రేడు వాగు వరద నివరణ కార్యక్రమం వెంటనే చేపడుతామని మంత్రి స్పష్టం చేశారు. కొత్త‌గూడెం ప‌ట్ట‌ణం నుంచి ప్ర‌వ‌హించే ముర్రెడు వాగును కోత నుంచి కాపాడుకుంటాం అని కేసీఆర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేస్తామ‌న్నారు. సింగ‌రేణిలో జ‌ర్న‌లిస్టు సోద‌రుల‌కు ఇండ్ల స్థ‌లాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

కొత్త‌గూడెం జిల్లాలోని 481 గ్రామ‌పంచాయ‌తీలు ఉన్నాయని చాలా వ‌ర‌కు ఏజెన్సీ పంచాయ‌తీలు ఉన్నాయి. అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. గోదావ‌రికి అవ‌త‌ల ఉన్న ప్రాంతంలోని వారికి 3 ఫేజ్ క‌రెంట్ క‌ల్పించాం. గ్రామ‌పంచాయ‌తీల అభివృద్ధి కోసం ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక‌ నిధి నుంచి గ్రామానికి రూ. 10 ల‌క్ష‌ల చొప్పున మంజూరు చేస్తున్నామన్నారు.

ప్ర‌జా కార్య‌క్ర‌మాల కోసం నిధుల‌ను వినియోగించాలని వివరించారు. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో కొత్త‌గూడెం, పాల్వంచ‌, ఇల్లందు, మ‌ణుగూరు మున్సిపాలిటీలు ఉన్నాయని అందులో పాల్వంచ‌, కొత్త‌గూడెం మున్సిపాలిటీల్లో జ‌నాభా అధికంగా ఉందని ఈ రెండు మున్సిపాలిటీల‌కు రూ. 40 కోట్ల చొప్పున‌, మిగ‌తా రెండింటికి రూ. 25 కోట్ల చొప్పున ప్ర‌త్యేక ఫండ్ మంజూరు చేస్తున్నాం అని కెసిఆర్ ప్ర‌క‌టించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News