Friday, November 22, 2024

కెసిఆర్ వ్యూహంతో ప్రతిపక్షాలు కకావికలం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

మెదక్: సిఎం కెసిఆర్ వ్యూహం ఎవరూ ఊహించలేదని, సీట్ల ప్రకటనతో విపక్షాలు కకావికలమవుతున్నాయని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.  మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. మెదక్ వేదికగా బుధవారం సిఎం కెసిఆర్ ప్రగతి శంఖారావం పూరిస్తారన్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటి సభ నూతన ఉత్సాహంతో జరుగుతుందని, మెదక్ లో పదికి పది సీట్లు గెలిచి సిఎం కెసిఆర్ కు బహుమతి ఇస్తామన్నారు. 16 రాష్ట్రాల్లో బిడి కార్మికులు ఉన్నారని, కానీ ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీష్ రావు ప్రశంసించారు. దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్లు కూడా అందిస్తారని, తర్వాత జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో మాట్లాడుతారని వివరించారు.

Also Read: ఒవైసీ ముత్తాత బ్రాహ్మణుడా? అసదుద్దీన్ స్పందన ఇది…

3గంటల సమయంలో సభ కు హాజరవుతారని, సిఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపే సభ ఇది అని, టిఆర్ఎస్ పాలనలో మెదక్ రూపు రేఖలు మారాయని, ఈ రాజకీయ పార్టీ కూడా ఓకే సారి భారీ సంఖ్యలో సీట్లు ప్రకటించలేదని, బిఆర్ఎస్ శ్రేణులు అంతా ఉత్సవాలు జరుపుకుంటున్నాయన్నారు. కాంగ్రెస్ వాళ్లకు లీడర్లు లేరని, బిజెపి వాళ్ళు కేడర్ లేదని ఎద్దేవా చేశారు. యువత, విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు బి ఆర్ ఎస్ కు పెద్ద ఎత్తున జై కొడుతున్నారని, సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే గులాబీ జెండా ఎగరాల్సిందేనని స్పష్టం చేశారన్నారు. దేశం మెచ్చే విధంగా కెసిఆర్ పాలన ఉందని, తెలంగాణ పథకాలను బిజెపి కాపీ కొట్టి దేశవ్యాప్తంగా అమలు చేస్తుందని, కుల వృత్తులకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించే పథకాన్ని కూడా కేంద్రం కాపీ కొట్టిందని చురకలంటించారు. మనం ఉచితంగా లక్ష రూపాయలు అందిస్తే, కేంద్రం లోన్ల రూపంలో ఇస్తుందట అని హరీష్ రావు దుయ్యబట్టారు. టిఆర్ఎస్, బిజెపికి ఉన్న తేడా ఇదేనని, అంతకుముందు అధికారులతో కలిసి సిఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించారన్నారు.

బుధవారం సిఎం కెసిఆర్ మెదక్ జిల్లా పర్యటన నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షించారు. మెదక్‌ సమీకృత కలెక్టరేట్‌, పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం, బిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి పోలీసు, ఆర్ అండ్ బి, ప్రజాప్రతినిధులు, అధికారులతో హరీష్ రావు సమీక్షించారు.  బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని సందర్శించి, పెద్ద సంఖ్యలో తరలి వచ్చే ప్రజలు, పార్టీ శ్రేణుల కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రితోపాటు స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పి, ఇతర ప్రజాప్రతినిధులు, పలు విభాగాల అధికారులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News