జనగామ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ డివిజన్ ఇవాళ సాగులో నంబర్ వన్ స్థానంలో ఉందని సిఎం కెసిఆర్ తెలిపారు. బిఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో జనగామ పట్టణం గులాబీమయంగా మారింది. జనగామ బిఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ ప్రసంగించారు. జనగామ, భువనగిరిని గ్రోత్ కారిడార్లుగా అభివృద్ధి చేస్తున్నామని, ఓటు మన తలరాతను, రాష్ట్రం దశదిశను మారుస్తుందని చెప్పారు. మల్లన్నసాగర్ జనగామకు నెత్తిమీద కుండలా ఉందని, మల్లన్నసాగర్‌ను టపాస్‌పల్లి రిజర్వాయర్‌కు లింకు చేస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారు. జనగామకు నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు తీసుకవస్తానని, చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తానని హామీ ఇచ్చారు. జనగామ జిల్లాలో గతంలో ఊరూరు తిరిగానని, అప్పటి పరిస్థితులును చూసి కళ్లకు నీళ్లు వచ్చాయని, ప్రతి గ్రామంలో యువకులంతా వలస పోయిన దుస్థితి ఉండేదని కెసిఆర్ గుర్తు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ డివిజన్ ఇవాళ నంబర్ వన్ స్థానంలో ఉందని కొనియాడారు. తెలంగాణ మొత్తం కరువు వచ్చినా జనగామకు కరువు ఉండదని చెప్పారు.
మల్లన్నసాగర్ జనగామాకు నెత్తిమీద కుండలా ఉంది: కెసిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -