హైదరాబాద్: టిఎన్జీఓలు, టిజిఓల ప్రతినిదులతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. గురువారం ప్రగతి భవన్ లో టిఎన్జీఓలు, టిజిఓల ప్రతినిదులతో సమావేశమైన సిఎం కెసిఆర్.. ఉద్యోగుల వేతన సవరణ, ఆరోగ్య పథకంపై చర్చించినట్లు తెలుస్తోంది. వేతన సవరణ కమిషన్ తోపాటు మధ్యంతర భృతి ప్రకటిస్తామని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. రేపు లేదా ఎల్లుండి వేతన సవరణ కమిషన్, మధ్యంతర భృతిపై సిఎం అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం ఉంది.ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తామని సిఎం కెసిఆర్ చెప్పినట్లు సమాచారం.
కాగా, రాష్ట్రంలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో పలు హామీలను, పెండింగ్ పనులను పూర్తి చేయాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసిని ప్రభుత్వంలోన విలీనం చేయడం, రైతులకు లక్ష రుణమాఫీని అమలు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.