Saturday, April 12, 2025

పేపర్ లీకేజీపై ప్రగతి భవన్ లో కెసిఆర్ సమావేశం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పేపర్ లీకేజీ వ్యవహారంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ తో టిఎస్ పిఎస్పి ఛైర్మన్ సమావేశమయ్యారు. శనివారం ఉదయం ప్రగతి భవన్ లో టిఎస్ పిఎస్పి ఛైర్మన్ తోపాటు మంత్రులు హరీశ్ రావు, కెటిఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు అధికారులతో సిఎం కెసిఆర్ పేపర్ లీకేజీపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ, తదుపరి కార్యాచరణపై సిఎం చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టిఎస్ పిఎస్పిపై సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News