Monday, December 23, 2024

ఏకాభిప్రాయంతోనే ప్రధాని

- Advertisement -
- Advertisement -

CM KCR meets Bihar CM Nitish Kumar

మాది థర్డ్ ఫ్రంట్ కాదు..మెయిన్ ఫ్రంట్

మోడీ పాలనలో దేశం అధోగతి

భారత్‌ను అభివృద్ధిపథంలో నడిపే ప్రభుత్వం రావాలి
ప్రజల మధ్య కమలనాథులు విద్వేషం పెంచుతున్నారు

ముక్త్త్ బిజెపితోనే దేశానికి విముక్తి తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్న కేంద్రం 
70వేల టిఎంసి జలాలు అందుబాటులో ఉన్నా తాగునీటికి, సాగునీటికి ఇంకా కటకటే
సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న మోడీ సర్కార్.. ఇదేమని అడిగితే ఇడి, ఐటి దాడులతో వేధింపులు

 పాట్నా మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్, బీహార్ సిఎం నితీశ్‌కుమార్

డిప్యూటీ సిఎం తేజస్వీతో కలిసి గల్వాన్ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం పంపిణీ
హైదరాబాద్ టింబర్ డిపోలో మరణించిన కూలీల కుటుంబాలకు పరిహారం అందజేత కెసిఆర్‌కు అపూర్వ స్వాగతం

మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపికి వ్యతిరేకం గా ఏర్పాటు చేస్తున్న కూటమికి నాయకత్వం ఎవరూ వహిస్తారన్నది ఇప్పుడే చెప్పలేమని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. దీనిపై అందరం కలిసి ఏ కాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నాటికి ఈ విషయంపై ఒక స్పష్టత రానుందన్నారు. కూటమికి నాయకత్వం ఎవరు వ హించినా….అందరి లక్షం బిజెపిని ఇంటికి సాగనంపడమేనని అన్నారు. ప్రస్తుతం దేశానికి బిజెపి లాంటి రొటీన్ ప్రభుత్వాలు అవసరం లేదన్నారు. భారత్‌ను అన్ని రంగాల్లో మార్చే ప్రభుత్వం…అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రభుత్వం రావాలని కెసిఆర్ ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే బిజెపికి వ్యతిరేకంగా బలమైన ప్రత్యమ్నాయన్ని ఏర్పాటు చేసే వి ధంగా తాను అడుగులు వేస్తున్నానని అన్నా రు. కేంద్రంలోని మోడీ సర్కార్ కేవలం అబద్ధాలతోనే పాలన సాగిస్తోందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. దేశంలో విద్వేషం నింపే శక్తులను పారదోలాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. విద్వేషం పెరిగితే దేశానికే తీరని నష్టమని సిఎం పేర్కొన్నారు. బీహార్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమం త్రి నితీశ్‌కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెసిఆర్ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఆయన పాలన దేశాన్ని తిరోగమణ దిశగా తీసుకెలుతోందని ఆరోపించారు. అందుకే బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ పాలనలో దేశం పూర్తిగా నష్టపోయిందన్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనమైందన్నారు. రైలుతు, పేదలు, మహిళలు ఏ ఒక్కరికీ మోడీ సర్కారు ఏం చెయ్యలేదన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నదుల్లో 70 టిఎంసిల నీరు అందుబాటులో ఉందని, కానీ వాటిని ఉపయోగించుకునే ఆలోచన మాత్రం కేంద్రానికి లేదని విమర్శించారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా తాగునీరు, విద్యుత్ సమస్యలు తీర్చలేదని ఎద్దేవా చేశారు. సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో వనరులు సమృద్ధిగా ఉన్నా ఉపయోగించుకోవట్లేదని కెసిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు బిజెపి ఈ దేశాన్ని ఏం చేయాలని అనుకుంటోందని ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం మంచి చేసి ఉంటే రైతులు ఉద్యమించే వారు కాదు కదా అన్నారు.
ఇదేమని కేంద్రాన్ని అడిగితే…వారిపై ఇడి, ఐటి దాడులు చేయిసస్తోందని విమర్శించారు. అయితే అలాంటి బెదిరింపులకు తాము భయపడేది లేదన్నారు. తెలంగాణలో సమర్ధవంతమైన పాలన అందిస్తున్నామన్నారు. అనతి కాలంలోనే దేశంలోనే అదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు. కొన్నికొన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను కేంద్రం కాపీ కొట్టి అమలు చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చామన్నారు. అందుకే తెలంగాణ అంటే కేంద్రానికి మంట అని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలే ఉండాలనా? అని ప్రశ్నించారు. ఇతర పార్టీలు అధికారంలోకి రావొద్దా? అని మండిపడ్డారు. వచ్చిన ప్రభుత్వాలను కూడా పూర్తి కాలం అధికారంలోకి కొనసాగనివ్వకుండా మోడీ ప్రభుత్వం యత్నిస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను దొడ్డిదారిన కూల్చివేసి బిజెపికి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మోడీ రాజకీయాలు చేస్తుండడం సిగ్గుచేటన్నారు. ఆయన ప్రధానిగా కాకుండా ఒక పార్టీ నాయకుడిగా వ్యవహిరిస్తుండడం శోచనీయమన్నారు. గతంలో ఏ ప్రధాని కూడా ఇంత దిగజారి రాజకీయాలు ఎవరు చేయలేదన్నారు. ఈ ఘతన ఒక్క మోడీకే దక్కిందన్నారు. అందుకే దేశంలో బిజెపి వ్యతిరేక శక్తులు ఏకం కావాలన్నదే తన అభిమతమన్నారు. నితీశ్‌తో కూడా ఇదే చర్చించామని కెసిఆర్ వెల్లడించారు. అలాగే విపక్షాలను ఏకం చేసే విషయమై కూడా సమగ్రంగా తామిద్దరం మాట్లాడుకున్నామన్నారు. బిజెపి ముక్త్ భారత్ కావాలని గట్టిగా కోరుకుంటున్న వారిలో నితీశ్ కూడా ఉన్నారన్నారు. అలాంటి బిజెపిని సాగనంపితేనే భారతదేశం ప్రగతి పథంలోనడుస్తుందన్నారు. అందుకే బిజెపి వ్యతిరేక శక్తులను ఏకం చేస్తున్నామని, ఆ పార్టీని వ్యతిరేకించే వారందరినీ కలుపుకొని పోతామని కెసిఆర్ స్పష్టంచేశారు.
దేశానికి మోడీ ప్రభుత్వం చేసింది సున్నా
దేశానికి మోడీ ప్రభుత్వం ఏం చెయ్యలేదని కెసిఆర్ విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు మోడీ ప్రభుత్వం దోచిపెడుతోందని ఆరోపించారు. అదే సమయంలో సామన్యులు, పేద ప్రజల రక్తాన్ని తాగేవిధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తుల ధరలకు కళ్లెం వేయకపోవడంతో అవి ఇష్టాను సారంగా పెరుగుతూ పోతున్నాయన్నారు. ఫలితంగా నిత్యవసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. మోడీ అసమర్థ పాలన కారణంగా దేశంలో ద్రవ్యోల్భణం పెరిగిపోవడమే కాకుండా దేశంలో నిరుద్యోగం విలయం తావడం చేస్తోందన్నారు. నల్లధనాన్ని తీసుకొస్తానని చెప్పిన మోడీ….ఇప్పటి వరకు ఏ ఒక్కరి నుంచి అయినా తీసుకరాగలిగారా? అని ప్రశ్నించారు. పైగా దేశంలో ఒక్క కొత్త ప్రాజెక్టు నిర్మాణాన్ని అయినా చేపట్టారా? అని అడిగారు. ఎలాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టని బిజెపి ప్రభుత్వం పన్నుల రూపంలో వసూలు చేస్తున్న నిధులన్నీ ఏమవుతున్నాయన్నారు. దీని వెనుక కచ్చితంగా ఏదో జరుగుతోందన్నారు. ఈ అంశంపై దృష్టి సారించామని….సరైన సమయంలో కేంద్రం గుట్టను బయటపెట్టనున్నట్లు ఈ సందర్భంగా కెసిఆర్ హెచ్చరించారు.
మేకిన్ ఇండియా వట్టిమాట
దేశంలోని ఎయిర్‌పోర్టులు, రైల్వేలు అన్నింటిని కేంద్రం ప్రైవేటీకరిస్తోందని కెసిఆర్ మండిపడ్డారు. ప్రతిష్టాత్మక సంస్థ ఎల్‌ఐసిని కూడా ప్రైవేటీకరణ చేయడం ఏంటని నిలదీశారు. మోడీ ప్రభుత్వం గొప్పులు చెప్పుకుంటున్నట్లుగా మేకిన్ ఇండి యా అనేది వట్టిమాటేనని అన్నారు. అన్ని వస్తువులు ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతూనే ఉన్నాయన్నారు. చివరకు గాలి పటాలు ఎగరేసే మాంజా కూడా చైనా నుంచే దిగుమతి అవుతోందని కెసిఆర్ విమర్శించారు. ఒక పక్క బేటీ బచావో బేటీ పడావో అంటున్నారని కానీ మరో పక్క అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు.
అభివృద్ధి బాటలో సాగుతున్న యువరాష్ట్రం
తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అభివృద్ధి బాటలో సాగుతున్న యువ రాష్ట్రమని కెసిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో బీహార్‌కు చెందిన వేలమంది శ్రామికులు భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. వీరు ఎన్నో రంగాల్లో పని చేస్తున్నారన్నారు. వారిని తమ ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటోందన్నారు. అదే సమయంలో గొప్ప ప్రభుత్వంగా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ప్రత్యేక రైళ్ళను నడపాలని కోరినా పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చిన బీహార్ రాష్ట్రం వారైనా, వేరే రాష్ట్రం వారైనా వారిని తమ రాష్ట్ర ప్రతినిధులుగా భావిస్తున్నామని గతంలోనే పలుమార్లు చెప్పానని అన్నారు. అందుకే వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నామన్నారు. ఇందులో భాగంగానే కేంద్రం ముందుకు రాకపోయినా కరోనా సమయంలో ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసి ఎంతోమంది కార్మికులు, శ్రామికులను వారివారి రాష్ట్రాలకు తరలించామన్నారు. తాము గోదావరి నది ఒడ్డు నుండి గంగా నది ఒడ్డుకు వచ్చామన్నారు. గంగా నదిని పవిత్రనదిని భావించనట్లుగానే తెలంగాణలో గోదావరి నదిని దక్షిణ గంగగా భావిస్తామని ఈ సందర్భంగా కెసిఆర్ తెలిపారు. జయ ప్రకాశ్ నారాయణ్ జన్మించిన పవిత్ర భూమి బీహార్ అని అన్నారు. ఇక్కడి ప్రజల చైతన్యంతో ప్రారంభమయిన ప్రతి మార్పు ఈ దేశంలో శాంతికి దారి తీసిందన్నారు. బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయం ఎంతో చారిత్రకమైందదన్నారు. ఇక్కడికి వచ్చి ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
నితీశ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి
నితీశ్‌కుమార్ కూడా చాలా కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారని….చాలా సీనియర్ పొలిటిషియన్ అని కెసిఆర్ అన్నారు. ఆయన ప్రధాని పదవి రేసులో ఉండే అన్ని అర్హతలు ఉన్నాయని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కెసిఆర్ వ్యాఖ్యానించారు. దానిపై ఇప్పడే ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదన్నరు. ఈ కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఎన్నికల సమయంలో, విస్తృత చర్చల అనంతరం తీసుకుంటామన్నారు. అలాగే గుజరాత్ మోడల్ గురించి మరో విలేకరి ప్రశ్నించగా…. గుజరాత్ మోడల్ అట్టర్ ప్లాప్ అని అన్నారు. అలాంటి విఫలమైన మోడల్ దేశానికి అవసరమా? అని ప్రశ్నించారు. గుజరాత్‌లో కూడా తాగునీరు, విద్యుత్ సమస్యలు ఉన్నాయని చెప్పారు.
అడుగడుగునా ఘనస్వాగతం
పాట్నాకు చేరుకున్న సిఎం కెసిఆర్‌కు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌తో పాటు పలువురు సాదరంగా స్వాగతం పలికారు. కాగా కెసిఆర్ రాక సందర్భంగా పలు ప్రాంతాల్లో భారీగా ఆయన ఫ్లెక్సీలను నెలకొల్పారు.

CM KCR meets Bihar CM Nitish Kumar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News