Monday, December 23, 2024

మంత్రి గంగులను పరామర్శించిన సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: బీసీ సంక్షేమం, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు పరామర్శించారు. ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య మరణించారు. దీంతో సోమవారం కరీంనగర్ లో ద్వాదశ దిన కర్మ కార్యక్రమం నిర్వహించారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుండి కరీంనగర్ చేరుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్, గంగుల మల్లయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం మంత్రి గంగులను, ఆయన కుటుంబ సభ్యులను సిఎం కెసిఆర్ పరామర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News