Monday, December 23, 2024

దేశాభివృద్ధికి కొత్త ఎజెండా అవసరం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దేశాభివృద్ధికి కొత్త ఎజెండాను రూపొందించాల్సిన అవసరం చాలా ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ముంబాయికి వెళ్ళిన ఆయనకు ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై వారు తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానంగా కేంద్రంలోని బిజెపి సర్కారు రాష్ట్రాల పట్ల అనుసరిస్తునన వివక్ష, రాష్ట్రాలపై పెత్తనం తదితర విషయాలపై చర్చించారు. ఇందుకు వ్యతిరేకంగా మోడీ సర్కారుపై గట్టిగా పోరాడాలని నిర్ణయించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, మోడీ హయంలో దేశం అన్ని రంగాల్లో పూర్తిగా పతనమైందని విమర్శించారు. బిజెపి సర్కార్ దేశ ప్రగతిపై దృష్టి సారించకుండా రాష్ట్రాల హక్కులను హరించే విషయానికే అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. దీని కారణంగా దేశంలో ప్రస్తుతం ఫెడరల్ వ్యవస్థకు తీవ్ర విఘాతం ఏర్పడిందన్నారు. బిజెపియేతర ప్రభుత్వాల పట్ల మోడీ సర్కార్ వివక్ష కొనసాగిస్తూ…అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని సిఎం కెసిఆర్ మండిపడ్డారు.

అందుకే దేశాభివృద్ధికి కొత్త ఎజెండా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శరద్ పవార్ ఇచ్చిన మద్దతును ఎప్పటికి మర్వలేమని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. 1969 నుంచి తెలంగాణ పవార్ మద్దతుగా ఉన్నారన్నారు. 75 ఏండ్ల స్వేచ్ఛా భారతంలో ఇంకా అనేక సమస్యలు అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి బాగా కుంటుపడిందన్నారు. దేశం సరైన రీతిలో ముందుకు పోవడం లేదన్నారు. త్వరలో భావసారుప్యం గల పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయలనుకున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. అందరం కలిసి దేశాభివృద్ధికి చేపట్టాల్సిన ఎజెండాపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రజల ముందుంచుతామన్నారు. దేశంలో విశేష అనుభవం ఉన్న నేత శరద్ పవార్… మోడీ సర్కారుపై చేపట్టిన తమ పోరాటానికి మద్దతుగా నిలిచి ఆశీర్వదించారని సిఎం కెసిఆర్ చెప్పారు.
అనంతరం శరద్ పవార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో అనేక సమస్యలు పీడిస్తున్నాయన్నారు. నిరుద్యోగం, ఇంధన ధరలు చెప్పుకుంటూ పోతే మోడీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ అనేక సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని కితాబిచ్చారు. దేశ అభివృద్ధికి కెసిఆర్ లాంటి నేతలు చాలా అవసరమన్నారు. అందుకే కెసిఆర్‌తో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. దీని కోసం ప్రత్యేకంగా కార్యచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. బిజెపియేతర పార్టీలన్నింటిని ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చే విధంగా తమ ప్రణాళిక ఉంటుందన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.

CM KCR Meets Sharad Pawar in Mumbai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News