Saturday, April 5, 2025

నాడు భయపడితే తెలంగాణ వచ్చేదా?: బిఆర్ఎస్ నేతలకు కెసిఆర్ సందేశం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ(బిజెపి)పై బిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నేతలకు సిఎం కెసిఆర్ సందేశం పంపారు. ”బిఆర్ఎస్ ఏర్పడిందని బిజెపి బరితెగించి దాడులు చేస్తోంది. తెలంగాణ ప్రగతిని బిజెపి అడుగడుగునా అడ్డుకుంటోంది. పనికిమాలిన పార్టీలు పనికట్టుకొని దుష్పచారాలు చేస్తాయి. వాటిని అప్రమత్తతతో తిప్పి కొట్టాలి. ఎప్పుడైనా ధర్మమే జయిస్తుంది. ప్రజలే కేంద్ర భిందువుగా బిఆర్ఎస్ పనిచేస్తోంది. తెలంగాణ సమాజం బిఆర్ఎస్ ను ఎప్పుడూ వదులుకోదు. చిల్లరమల్లర రాజకీయ శక్తులను ఎప్పుడూ ఆదరించరు. లక్షల కుట్రలను చేధించి గెలిచిన పార్టీ మనది.నాడు భయపడితే తెలంగాణ వచ్చేదా?” అని సందేశంలో సిఎం కెసిఆర్ బిఆర్ఎస్ నేతలను ఉద్దేశించి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News