Saturday, December 21, 2024

పోరు హోరెత్తాలి

- Advertisement -
- Advertisement -

CM KCR met TRS MPs on Monday

రాష్ట్ర రైతుల పట్ల మోడీ ప్రభుత్వ
వైఖరిని ఎండగట్టాలి కలిసివచ్చే
పార్టీలను కలుపుకొని పార్లమెంటులో
కేంద్రాన్ని నిలదీయాలి ఎంతవరకైనా
పోరాటానికి టిఆర్‌ఎస్ సిద్ధంగా
ఉంటుంది రాష్ట్రంలోని అన్ని మండల
కేంద్రాల్లో నిరసన దీక్షలు
మొదలయ్యాయి జాతీయ
రహదారులపై కూడా నిరసనలు
చేపడుతాం: ఢిల్లీలో టిఆర్‌ఎస్
ఎంపిలతో భేటీలో
ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రం దిగొచ్చేంత వరకు మన పోరాటం ఆగొద్దు అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్ సోమవారం టిఆర్‌ఎస్ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై పార్టీ ఎంపిలు కేంద్రాన్ని పట్టుబడుతున్న వైనంపై కూడా ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆరా తీసినట్లుగా సమాచారం. ఈ వ్యవహారంపై కేంద్రంతో యుద్ధం ప్రకటించిన విజయం సాధించే వరకు విశ్రమించేది లేదని సిఎం వ్యాఖ్యానించినట్లుగా టిఆర్‌ఎస్ వర్గాల ద్వారా తెలిసింది. ప్రధానంగా కేంద్రంపై పోరుకు ఐదంచెల పోరును చేపడుతున్న నేపథ్యంలో ….ఆ ప్రభావం పార్లమెంట్ సమావేశాల్లోనూ చాలా స్పష్టంగా కనిపించాలని పార్టీ ఎంపీలకు సూచించారు. ప్రధానంగా మోడీ ప్రభుత్వం రాష్ట్ర రైతుల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై దేశవ్యాప్తంగా చట్టసభల్లో ఎండగట్టాలన్నారు. ఇందుకు కలిసివచ్చే పార్టీలతో కలిసి పెద్దఎత్తున పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీయాలన్నారు.

ఈ విషయంలో ఎంతవరకైనా పోరాటం చేసేందుకు టిఆర్‌ఎస్ పార్టీ సిద్దంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం సోమవారం రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు మొదలయ్యాయని తదనంతరం రాష్ట్రంలోని జాతీయ రహదారులపై నిరసనలు కూడా ఉంటాయన్నారు. టిఆర్‌ఎస్ ఆందోళనలతో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా సిఎం చర్చించినట్లుగా తెలుస్తోంది. వీటితో పాటు ఈ నెల 11వ తేదీన ఢిల్లీ వేదికగా టిఆర్‌ఎస్ పార్టీ చేయాల్సిన నిరసనల కార్యక్రమాలపై కూడా చర్చించినట్లు సమాచారం. ఈ ఆందోళన దేశవాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించే విధంగా ఉండాలన్నారు. ఢిల్లీలో జరిగే ఈ ఆందోళన కార్యక్రమానికి మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండిలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులతో పాటు టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారన్నారు. వారి కోసం అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో అవసరమైతే తాను కూడా హాజరయ్యే అవకాశం లేకపోలేదన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News