Monday, January 20, 2025

హైకోర్టు సిజెతో ముఖ్యమంత్రి భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే తో సిఎం కెసిఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల్లో మౌలిక వసతుల కల్పన, సంబంధిత అంశాలపై సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిఐ) లో జరిగిన సమావేశంలో సిఎం కెసిఆర్ చర్చించారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జీలు జస్టిస్ శ్యామ్ కోషీ, జస్టిస్ అభినందన్ కుమార్ షావలి, జస్టిస్ వినోద్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తిరుమలాదేవి, లా సెక్రటరీ తిరుపతి, తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News