- Advertisement -
హైదరాబాద్: నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజిరెడ్డి (92) అనారోగ్యంతో మృతి చెందడంపై సిఎం కెసిఆర్‌తో పాటు మంత్రి కెటిఆర్ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి వారు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి వారు ప్రార్థించారు. వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం కలిగించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆకాక్షించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి మృతిపై వారు విచారం వ్యక్తం చేశారు. సంతాపం తెలిపిన వారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.
CM KCR mourns death of MLA Peddi Sudarshan Reddy father
- Advertisement -