Wednesday, January 22, 2025

ఆత్మీయ మిత్రుడిని కోల్పోయా: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR mourns the death of Bojjala Gopala Krishna Reddy

అమరావతి: టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతికి ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఆత్మీయా మిత్రుడిని కోల్పోయానని విచారం వ్యక్తం చేశారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుబంధాన్ని, ఉమ్మడి రాష్ట్రంలో తనతో కలిసి పనిచేసిన రోజులను సిఎం గుర్తుచేసుకున్నారు. ఇటీవల బొజ్జల నివాసానికి వెళ్లి కెసిఆర్ పరామర్శించారు. బొజ్జల శ్రీకాళహస్తి నుంచి 5 సార్లు ఎంఎల్ఏగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన మంత్రిగా పనిచేశారు. అలిపిరిలో చంద్రబాబు కాన్వాయ్ పై క్లైమోర్ మైన్స్ పేలిన ఘటనలో చంద్రబాబు సహా ప్రణాలతో బయటపడిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News