Monday, December 23, 2024

సినీనటి జమున మృతిపై సిఎం కెసిఆర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

ప్రముఖ సినీ నటి, మాజీ పార్లమెంటేరియన్ జె. జమున వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సీనియర్ నటి జమున మృతి పట్ల సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్రమ‌ మొద‌టిత‌రం నటీమణుల్లో అగ్రక‌థానాయ‌కిగా వెలుగొంది తెలుగు వారి హృద‌యాల్లో చెర‌గని ముద్రవేసుకున్న జ‌మున మృతి చెంద‌డం బాధాక‌రమన్నారు. జ‌మున కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని కెసిఆర్ అన్నారు. ఆమె నటిగానే కాకుండా ఎంపిగా ప్రజాసేవ చేయటం గొప్ప విషయమని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News