Monday, December 23, 2024

రెబల్‌ స్టార్‌ మృతిపట్ల సిఎం కెసిఆర్‌ సంతాపం

- Advertisement -
- Advertisement -

CM KCR mourns the death of rebel star

హైదరాబాద్‌: రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మృతిపట్ల సిఎం కెసిఆర్‌ సంతాపం తెలిపారు. 50 ఏండ్ల సినీప్రస్థానంలో తన విలక్షణ నటనాశైలితో రెబల్‌స్టార్‌గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్నారని సిఎం చెప్పారు. ఆయన మరణం తెలుగు వెండితెరకు తీరని లోటని పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా రాజకీయ పాలనారంగం ద్వారా దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సిఎం కెసిఆర్‌ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News