Wednesday, January 22, 2025

కాసేపట్లో మునుగోడుకు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR Munugodu Tour

హైదరాబాద్: కాసేపట్లో సిఎం కెసిఆర్ మునుగోడుకు చేరుకోనున్నారు. మునుగోడులో ప్రజాదీవెన సభకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్తున్నారు. కెసిఆర్ కు స్వాగతం పలుకుతూ కాన్వాయ్ వెంట పార్టీ శ్రేణుల వాహనాలు భారీ ర్యాలీగా వెళ్తున్నాయి. ప్రజాదీవెన సభకు టిఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. దీంతో ప్రజాదీవెన సభకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మునుగోడు ప్రజాదీవెన సభకు ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ 300 కార్లతో బయలుదేరారు. కార్యకర్తలతో కలిసి నెక్లెస్ రోడ్ నుంచి దానం ర్యాలీగా వెళ్లారు. అటు మారేడ్ పల్లిలో 400 కార్లతో పార్టీ శ్రేణులు సభకు బయలు దేరినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News