Monday, December 23, 2024

నెరవేరిన తొమ్మిదేళ్ల కల

- Advertisement -
- Advertisement -

CM KCR named the 09 years old child

మన తెలంగాణ/హైదరాబాద్ : తమ బిడ్డకు పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల తొమ్మిదేండ్ల కల సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ఫలించింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన భూపాలపల్లి మండలం, నందిగామ గ్రామానికి చెందిన సురేశ్, అనిత దంపతులు 2013లో ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు నాటి ఉద్యమ రథసారథి, ప్రస్తుత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతోనే నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఆడపిల్లకు పేరు పెట్టకుండానే పెంచుకుంటూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, స్థానిక నేత ఎంఎల్‌సి మధుసూధనాచారి చొరవ తీసుకుని, తల్లిదండ్రులను బిడ్డను ఆదివారం ప్రగతి భవన్‌కు తోడ్కొని వచ్చారు.

విషయం తెలుసుకున్న సిఎం కెసిఆర్ దంపతులు, సురేష్ అనిత దంపతులను దీవించి వారి తొమ్మిదేండ్ల ఆడబిడ్డకు..‘మహతి ’ అని నామకరణం చేశారు. తమ ఇంటికి వచ్చిన వారికి స్వయంగా సిఎం దంపతులు బట్టలు పెట్టి సాంప్రదాయ పద్దతిలో ఆథిత్యమిచారు. బిడ్డ చదువుకోసం ఆర్థిక సాయాన్ని అందించారు. తమ తొమ్మిదేండ్ల కల ఫలించడమే కాకుండా, ఊహించని రీతిలో తమను కెసిఆర్ ఆదరించి దీవించిన తీరుకు, సురేష్ కుటుంబం సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యింది. ఈ సందర్భంగా వారు సిఎం దంపతులకు మనస్పూర్తిగా కృతజ్జతలు తెలుపుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News