Sunday, November 17, 2024

సిఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలి: పవన్

- Advertisement -
- Advertisement -

CM KCR needs to recover quickly: Pawan Kalyan

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. సిఎం కెసిఆర్ కు క‌రోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన జ‌న‌సేనాని కెసిఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆయ‌న కోలుకుని ఎప్ప‌టిలాగే ప్ర‌జాసేవ‌లో నిమ‌గ్నం కావాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాన‌ని ప‌వ‌న్ కళ్యాణ్ తెలిపారు. అలాగే, మాజీ ప్రధానమంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ కరోనాతో ఎయిమ్స్‌లో చేరిన‌ట్లు స‌మాచారం అందింద‌న్నారు. ఒక ఆర్థిక వేత్తగా,దేశ ప్రధానిగా ఎన్నో సేవలు అందించిన ఆయ‌న ఈ వ్యాది నుంచి బయటపడి ఆరోగ్యవంతులు కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాన‌ని పవన్ పేర్కొన్నారు. కాగా, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కూడా కోవిడ్-19 సోకిన విషయం తెలిసిందే.

CM KCR needs to recover quickly: Pawan Kalyan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News